సామాజిక కార్యకర్త నానాజీ దేశ్‌ముఖ్, రాజకీయవేత్త జయప్రకాశ్ నారాయణ్ లాంటి లెజెండ్స్ ను చూసి దేశం ఎంతో గర్విస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు.
వారిద్దరి జయంతిని పురస్కరించుకొని కృతజ్ఞతలు ఆవిష్కరిస్తున్నట్లు మోదీ ట్విట్టర్ వేదిగా పేర్కొన్నారు. ఈ భూమిలో ఇలాంటి లెజెండ్స్ పుట్టినందుకు చాలా గర్వంగా ఉందని తెలిపారు.
‘‘లోక్‌నాయక్ జయప్రకాశ్ నారాయణ్ జయంతి సందర్భంగా వారికి నమస్కరిస్తున్నా. దేశ స్వాతంత్య్రం కోసం పోరాడారు. ప్రజాస్వామ్య విలువలపై దాడి జరుగుతున్న సందర్భంలో పెద్ద పెద్ద ఉద్యమాలు నిర్వహించి, వాటిని కాపాడారు. జాతి ప్రయోజనాలు, ప్రజల సంక్షేమం తప్ప.. మరేమీ పట్టని మహానుభావుడు’’ అంటూ మోదీ ట్వీట్ చేశారు.
“లోక్‌నాయక్ అనుచరులలో గొప్ప అనుచరుడు నానాజీ దేశ్‌ముఖ్. ఆయన ఆలోచనలకు, ఆదర్శాలకు ప్రాచుర్యం కల్పించడానికి అవిశ్రాంతంగా కృషి చేశారు. గ్రామీణ భారతం కోసం ఆయన పడ్డ తపన, ఆయన చేసిన కృషి నిరంతరం మనల్ని ప్రేరేపిస్తూనే ఉంటుంది.’’ అని మోదీ మరో ట్వీట్ చేశారు.
More Stories
ఢిల్లీ తదుపరి ముఖ్యమంత్రిగా అతిశీ
కోల్‌కతా పోలీస్ కమిషనర్‌పై వేటుకు మమతా సమ్మతి
ప్రతిపక్షాలకు దేశం పట్ల ఎటువంటి బాధ్యత లేదు