
భారత్ – చైనా సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు ఐదారు నెలలుగా ఆందోళన కలిగిస్తున్నాయి. భారత్ ఇప్పటికే సర్వసన్నద్ధంగా మోహరించినప్పటికీ మొదటినుంచీ శాంతివైపే అడుగులు వేస్తోంది. చొరవ తీసుకొని మరీ పలు దఫాలుగా చర్చలు జరిపింది.
ఇటు ఆర్మీ అధికారుల స్థాయి చర్చలు మొదలుకొని, అంతర్జాతీయ వేదికలపై మంత్రులస్థాయి ముఖాముఖి చర్చల దాకా తీసుకెళ్లింది. కానీ, చైనా మాత్రం కుక్కతోక వంకర సామెతను తలపింపజేస్తోంది.
చర్చల్లో శాంతిమంత్రాలు జపిస్తూ.. సరిహద్దుల్లో మాత్రం రెచ్చగొట్టే చర్యలకు చైనా పాల్పడుతోంది. ఇన్నాళ్లుగా జరుగుతున్న పరిణామాలు, చైనా చెబుతున్న మాటలను నిశితంగా గమనిస్తోన్న అంతర్జాతీయ సమాజం క్రమంగా సరిహద్దుల్లో పరిస్థితులపై ఓ అంచనాకు వస్తోంది.
చైనా విస్తరణ వాదంపై ప్రపంచవ్యాప్తంగా ఆందోళన పెరుగుతోంది. ఆయా దేశాలు చైనా కుటిల నీతిని పసిగడుతున్నాయి. ఈ నేపథ్యంలో భారత్‌కు అండగా నిలిచేందుకు పలు దేశాలు సిద్ధమవుతున్నాయి. అగ్రరాజ్యం అమెరికా మొదలు ఒక్కోదేశం భారత్‌కు అండగా నిలిచేందుకు సమాయత్తమవుతున్నాయి.
ఈ సమయంలోనే జపాన్‌లోని టోక్యోలో జరిగిన క్వాడ్ దేశాల కూటమి సమావేశంలో కీలక అంశాలపై చర్చ జరిగింది. ప్రధానంగా చైనా అనుసరిస్తున్న తీరుపై క్వాడ్ కూటమిలోని అమెరికా, భారత్, ఆస్ట్రేలియా, జపాన్ కన్నెర్ర జేశాయి. స్వేచ్ఛ, నిజాయితీ, సమ్మిళిత ఇండో-పసిఫిక్ ప్రాంతం కోసం ఉమ్మడిగా పనిచేయాలని నిర్ణయించాయి.
క్వాడ్ కూటమి సమావేశాల్లో భారత విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్, అమెరికా విదేశాంగ కార్యదర్శి మైక్ పాంపియో, ఆస్ట్రేలియా విదేశాంగ మంత్రి మరిసెపేన్, జపాన్ విదేశాంగ మంత్రి తొషిమిత్సు మొటెగి పాల్గొన్నారు.
భారత్ సరిహద్దుల్లో చైనా అనుసరిస్తున్న వైఖరిని, సృష్టిస్తున్న ఉద్రిక్తతలపై క్వాడ్ దేశాలు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో క్వాడ్ మాత్రమే నిజమైన భద్రతా చట్రం అని అమెరికా అభివర్ణించింది. చైనా దూకుడుకు ముకుతాడు వేయాల్సిందేనని అమెరికా నొక్కి వక్కాణించింది.
క్వాడ్ సమావేశాల వేదికగా ఇండో-పసిఫిక్ ప్రాంతంలో ఈ నాలుగు దేశాలు ఏకమయ్యాయి. చైనాపై పోరులో భారత్‌కు అండగా నిలబడేందుకు నిర్ణయించాయి. అయితే, ఇది ఇక్కడితో ఆగదని, అంతర్జాతీయంగా చైనా ఒంటరి అయ్యే సమయం ఎంతో దూరంలో లేదని జరుగుతున్న పరిణామాలు చూస్తే అర్థమవుతోంది.
భారత్‌పై చైనా మరోసారి కుట్రకు పాల్పడేందుకు సిద్ధంగా ఉందని, భారత సరిహద్దుల్లో చైనా 60వేల మంది సైనికులను మోహరించిందని అమెరికా విదేశాంగ కార్యదర్శి మైక్ పాంపియో హెచ్చరించడం గమనార్హం. బలమైన ఆర్థిక వ్యవస్థలు ఉన్న క్వాడ్ దేశాలపై చైనా కుట్రలు పన్నుతోందన్నారు పాంపియో.
ఇక, అమెరికా జాతీయ భద్రతా సలహాదారు రాబర్ట్ ఓబ్రయిన్ కూడా ఇదే సమయంలోచర్చలు, ఒప్పందాల ద్వారా చైనా వ్యవహారశైలి మారదన్న వాస్తవం తెలుసుకోవాల్సిన సమయం వచ్చిందని వ్యాఖ్యానించారు. చైనా ఆగడాలను చూసీ చూడనట్లు వ్యవహరించడం, లేదంటే ఒక చెంపపై కొడితే రెండో చెంప చూపించడం వంటి చర్యల ద్వారా సాధించేది ఏమీ ఉండదని స్పష్టం చేశారు.
సైనిక శక్తి ద్వారా వాస్తవాధీన రేఖ వద్ద అజమాయిషీ సాధించేందుకు చైనా ప్రయత్నిస్తోందని ఆయన ఆరోపించారు. అయిదు నెలలు గడిచినా, చైనా సమస్యను కొలిక్కి తేవడానికి ప్రయత్నం చేయడం లేదని మండిపడ్డారు. భారత్, చైనా సరిహద్దుల్లోని లద్ధాఖ్ వద్ద నెలకొన్న పరిస్థితులపై నేరుగా వ్యాఖ్యనించడం ద్వారా ఓబ్రయిన్ చైనాకు ఝలక్ ఇచ్చారు.
పొరుగుదేశాల భూభాగాలను ఆక్రమించుకునే చైనా ప్రవర్తనకు కొంతకాలంగా భారత్ సరిహద్దుల్లో నెలకొన్న పరిస్థితులే కారణమని ఓబ్రయిన్ పేర్కొన్నారు. అంతేకాదు.. ప్రపంచ ఆర్థికాభివృద్ధి గురించి తాపత్రయమంటూ చైనా ప్రారంభించిన బెల్ట్ రోడ్ ఇనిషీయేటివ్ – బీఆర్ఐ కార్యక్రమాన్ని కూడా ఆయన విమర్శించారు.
బీఆర్ఐలో భాగంగా పేద దేశాలు చైనా ఇచ్చిన నిధులను తీసుకుంటూ అప్పుల ఊబిలో కూరుకుపోతాయని హెచ్చరించారు. అస్పష్టమైన, ప్రమాదకరమైన నిబంధనల కారణంగా చౌనా నుంచి అప్పులు తీసుకున్న దేశాలు భరించలేని స్థాయికి చేరుకుంటున్నాయని, ఆయా దేశాల నిధులన్నీ చైనా కంపెనీలకు చేరుతోందని ఓబ్రయిన్ ఆందోళనవ్యక్తం చేశారు.ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో ప్రస్తుతం ఐదో స్థానంలో కొనసాగుతున్న భారత్.. రానున్న 30 ఏండ్లలో మరో
(రచయిత చీఫ్ సబ్ ఎడిటర్, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి… ఆంధ్రజ్యోతి నుండి)
More Stories
బంగారు లక్ష్మణ్ కు ఘనంగా నివాళులు
దళారుల చేతుల్లో మోసపోతున్న తిరుమల భక్తులు
జీవన విలువల గురించి ఆర్ఎస్ఎస్లో నేర్చుకున్నాను