![టీటీడీ నూతన ఈవోగా జవహర్ రెడ్డి టీటీడీ నూతన ఈవోగా జవహర్ రెడ్డి](https://nijamtoday.com/wp-content/uploads/2020/10/Jawahar-Reddy-TTD.jpg)
తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో గా జవహర్ రెడ్డి శనివారం ఉదయం బాధ్యతలను స్వీకరించారు. ఈరోజు ఉదయం 6 గంటలకు అలిపిరి పాదాల మండపం వద్ద నుండి కాలినడకన కొండపైకి చేరుకున్నారు. అ
నంతరం వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ద్వారా ఆలయంలోకి చేరుకొని కుటుంబ సమేతంగా వేంకటేశ్వరుడిని దర్శించుకున్నారు. రంగ నాయకుల మండపంలో టిటిడి ఈవో గా బాధ్యతలను స్వీకరించారు. ఈ సందర్భంగా జవహర్ రెడ్డి కి వేదపండితులు ఆశీర్వచనాన్ని అందించారు.
ఆ తర్వాత అన్నమయ్య భవన్‌లో టిటిడి ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. ఇంతకుముందు టిటిడి ఈవో గా ఉన్న అనిల్ కుమార్ సింఘాల్ ను రాష్ట్ర ప్రభుత్వం వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శిగా బదిలీ చేశారు.
తిరుమల శ్రీవారికి సేవ చేసే భాగ్యం కలగడం చాలా సంతోషంగా ఉందని, ఎంతో పుణ్యఫలం చేస్తే గానీ ఈ అవకాశం దక్కదని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు.
‘శ్రీవారి పాదాల చెంత నేను చదువును పూర్తి చేశాను. భక్తుల సౌకర్యార్థం ప్రస్తుత్తం ఉన్న పద్దతులను మరింత పటిష్టం చేస్తా’నని హామీ ఇచ్చారు. రానున్న రోజుల్లో భక్తుల కోసం నూతన సంస్కరణలు తీసుకొస్తానని తెలిపారు. పూర్తి జాగ్రత్తలు తీసుకొని బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తే కరోనా వ్యాప్తి అరికట్టవచ్చని తెలిపారు.
అన్‌లాక్ 5లో భాగంగా మినహాయింపులు ఇచ్చారని, టీటీడీ ఉన్నత అధికారులతో బ్రహ్మోత్సవాలపై సమావేశం నిర్వహించి తగిన సూచనలు తెలియజేస్తామని జవహర్ రెడ్డి చెప్పారు.
More Stories
తిరుమల శ్రీవారి పరకామణి బంగారం చోరీకి యత్నం
పోలవరం పనులపై పార్లమెంటరీ కమిటీ అధ్యయనం
చివరకు తొక్కిసలాటపై క్షమాపణ చెప్పిన టిటిడి చైర్మన్