గుంటూరు జిల్లా నూతక్కి లో జరుగుతున్న రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ఆంధ్ర ప్రదేశ్ ప్రాంత సమావేశాలలో సేవాభారతి అభివృద్ధి చేసిన “రక్త సేవా యాప్ “ను సర్ సంఘచాలక్ డా. మోహన్ భాగవత్ నేడు ఆవిష్కరించారు. ఈ రక్త సేవా యాప్ కార్యకర్తను, రక్త దాతను, స్వీకర్త ని అనుసంధానం చేసి ఎక్కువ మందికి ఉపయోగపడేలా అభివృద్ధి చేశారని తెలిపారు.
గూగుల్ ప్లే స్టోర్ నుంచి” రక్త సేవా యాప్” ని డౌన్లోడ్ చేసుకొని మీ ఫోన్ లో ఇన్స్టాల్ చేసుకుని మీ పేరు తో రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మీకొరకు గాని మీకు తెలిసిన వారికొరకు రక్తం/ ప్లేట్ లెట్స్/ ప్లాస్మా కొరకు అభ్యర్థన చేయవచ్చు. అభ్యర్ధన చేసిన 3 గంటల లోపు దాతల నుండి అంగీకార సమాచారం వస్తుంది.
ఒకవేళ దాతల నుండి సమాచారం లభించినట్లయితే కాల్ సెంటర్ 040-4821-4920 కి ఫోన్ చేసినచో కాల్ సెంటర్ రక్త దాతలతో మాట్లాడి రక్తం అందేలా చూస్తారు అని సేవా భారత్ ప్రముఖ్ కాకాని పృధ్వీరాజ్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో క్షేత్ర సంఘచాలక్ నాగరాజు (బెంగళూరు), ప్రాంత సంఘచాలక్ భూపతి రాజు శ్రీనివాస రాజు, క్షేత్ర స హ సంఘచాలక్ దూసి రామకృష్ణ , క్షేత్ర ప్రచారక్ సుధీర్, ప్రాంత ప్రచారక్ భరత్ తదితరులు పాల్గొన్నారు.
More Stories
6 కొత్త వందే భారత్ రైళ్లను ప్రారంభించిన ప్రధాని మోదీ
రెండు రోజుల్లో ముఖ్యమంత్రిగా కేజ్రీవాల్ రాజీనామా
ప్రధాన మంత్రి పదవి అంటే తిరస్కరించా!