
పంజాబ్ నేషనల్ బ్యాంకును మోసగించిన వ్యవహారంపై ఆంధ్రప్రదేశ్‌లోని నరసాపురం వైఎస్‌ఆర్‌సిపి ఎంపి రఘురామకృష్ణం రాజుపై సిబిఐ గురువారం కేసు నమోదు చేసింది.
పంజాబ్ నేషనల్ బ్యాంకు నేతృత్వంలోని కన్సార్షియం రూ. 826.17 కోట్ల మోసానికి పాల్పడినట్టు ఫిర్యాదు మేరకు ఎఫ్‌ఐఆర్‌లో నిధులను దారిమళ్లించి దుర్వినియోగానికి పాల్పడ్డట్టు అభియోగాలు నమోదు చేసినట్లు సిబిఐ వర్గాలు పేర్కొంటున్నాయి.
ఇందులో భాగంగానే హైదరాబాద్, ముంబై, కర్ణాటక, సికింద్రాబాద్, ఢిల్లీ, పశ్చిమ గోదావరి జిల్లాల్లోని 11 ప్రదేశాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహించింది. ఎంపి రఘురామకృష్ణం రాజుకు చెందిన కంపెనీ కార్యాలయాలు, యజమాని నివాసాలు, ఇతర ప్రదేశాలపై సోదాలు జరిపిన అనంతరం ఎంపితో సహా మరో 9మందిపై చీటింగ్ కేసులు నమోదు చేసినట్లు సిబిఐ వర్గాలు తెలిపాయి.
గురువారం ఆయన నివాసంలో ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం వరకు సోదాలు చేపట్టారు. హైదరాబాద్‌లోని ఆయన నివాసంతో పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్, ముంబై సహా 11 ప్రాంతాల్లో సిబిఐ సోదాలు చేపట్టింది. ఢిల్లీ నుంచి వచ్చిన సిబిఐ ప్రత్యేక బృందాలు సోదాలు చేపట్టారు.
ఇండ్- భారత్ కంపెనీతో సహా ఎనిమిది కంపెనీలకు చెందిన డైరెక్టర్ల ఇళ్లలోనూ తనిఖీలు చేసింది. ఈ దాడుల్లో పలు కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. 2019 ఏప్రిల్ 30న బ్యాంక్ లోన్ బకాయిలు పడిన కేసులో సైతం హైదరాబాద్, భీమవరంలోని రఘురామకృష్ణంరాజు కంపెనీల్లో సోదాలు చేపట్టారు.
వివిధ ప్రాజెక్ట్‌లకు సంబంధించి రూ.600 కోట్ల మేర ఆయన రుణాలు తీసుకున్నారు. ఇక ఇండ్-భారత్ పవర్ లిమిటెడ్ కు సంబంధించి రూ.947 కోట్ల మేర బ్యాంకులకు రుణాలు ఎగ్గొట్టారు. నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ ఇనిస్టిట్యూట్ల నుంచి రూ.2655 కోట్ల మేర రఘురామకృష్ణంరాజు రుణాలు తీసుకున్నారు. బ్యాంకులకు ఎగవేత విషయమై రఘురామకృష్ణపై సిబిఐ దాడులు ఇదే తొలిసారి కాదు.
More Stories
అమరావతి పర్యటనలో ప్రధాని మోదీ రోడ్ షో రద్దు
ఏపీ పట్టణాల్లో స్లీపర్సెల్స్ పై పోలీసుల డేగకన్ను
ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన చంద్రమౌళి అంత్యక్రియలు