
ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రతిష్టాకరంగా భావిస్తున్న నిర్బంధంగా ఇంగ్లీష్ మీడియం విద్యాబోధన అమలుకు కోర్ట్ ల నుండి ఎదురవుతున్న అభ్యంతరాలు గందరగోళానికి దారితీస్తున్నాయి. ఈ విషయమై సుప్రీం కోర్ట్ చేసిన ప్రతికూల వ్యాఖ్యలతో ముఖ్యమంత్రి ఖంగారు పడుతున్నారు.
ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియంను ప్రవేశపెట్టి అణగారిన వర్గాల వారి మన్నన పొంది ఓట్లు రాబట్టుకోవాలనేది సిఎం జగన్ ఆలోచన. అందులో భాగంగానే ఇంగ్లీష్ మీడియం బోధన ప్రారంభించాలని నిర్ణయించారు. కానీ కోర్టుల్లో జగన్‌కు ఎదురుదెబ్బ తగులుతోంది.
తెలుగు మీడియాన్ని పూర్తిగా తీసివేసి ఆ స్థానంలో ఇంగ్లీష్ మీడియాన్ని అమలు చేయాలనకుంటున్న జగన్ ప్రభుత్వ నిర్ణయానికి పలు వర్గాల నుండి వ్యతిరేకత వస్తోంది. వైసిపి మినహా అన్ని రాజకీయపార్టీలు ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించాయి. ఈ నేపథ్యంలో మాతృభాషలోనే విద్యాబోధన ఉండాలని హైకోర్టు స్పష్టం చేస్తే జగన్ సర్కార్ సుప్రీం తలుపు తట్టింది.
ఇంకా తీర్పు రాకపోయినా తాజాగా జరిగిన విచారణలో సుప్రీంకోర్టు మాతృభాషకే మొగ్గుచూపింది. దీన్నిబట్టి చూస్తే దాదాపు కోర్టు తీర్పు ఎలా ఉంటుందో స్పష్టమైన అంచనాకు రావొచ్చు. రేపోమాపో కోర్టు తీర్పు వస్తే ఇక దాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అమలు చేయడానికి అవకాశం ఉండదు.
ఇంగ్లీష్ మీడియం కావాలంటూ 96 శాతం మంది తల్లిదండ్రులు కోరారని ప్రభుత్వం చెప్పినా సుప్రీంకోర్టు వినేలా లేదు. తల్లిదండ్రుల ఓట్లు చెదిరిపోకుండా ఉండాలనే యోచనలోనే వైసిపి నేతలు కనిపిస్తున్నారు. కోర్ట్ తీర్పులను సహితం రాజకీయ అస్త్రాలుగా మలచుకొని ప్రయత్నంలో ఉన్నట్లు తెలుస్తున్నది.
సుప్రీం తీర్పు ఆంగ్ల మాధ్యమానికి వ్యతిరేకంగా వస్తే ఆంగ్ల మాధ్యమాన్ని మేం ప్రవేశపెట్టాలనుకున్నాం కానీ చంద్రబాబుబు, ఆయన తమ్ముళ్లు న్యాయం పోరాటం అంటూ పేదలకు ఇంగ్లీష్ చదువులకు దూరం చేశారనే ప్రచారాన్ని విస్తృతం చేయాలని సిద్ధపడుతున్నట్లు చెబుతున్నారు.
More Stories
దక్షిణాది రాష్ట్రాలపై కేంద్రం వివక్ష ఆరోపణలపై కిషన్ రెడ్డి ఆగ్రహం
అమరావతి పర్యటనలో ప్రధాని మోదీ రోడ్ షో రద్దు
ఏపీ పట్టణాల్లో స్లీపర్సెల్స్ పై పోలీసుల డేగకన్ను