ట్రాక్టర్ పై సోఫాలో కూర్చొని రాహుల్ ర్యాలీ

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రత్యర్ధులకు అస్త్రంగా దొరికిపోయారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన వ్యవసాయం బిల్లును వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ పార్టీ పంజాబ్ లో మూడురోజుల పాటు ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించింది. అయితే ఈ ర్యాలీ వివాదంగా మారింది. 

ర్యాలీ సందర్భంగా రాహుల్ తీరుపై బీజేపీ కేంద్ర మంత్రులు ఎద్దేవా చేస్తున్నారు. ర్యాలీ సమయంలో ట్రాక్టర్ పై సోఫాను ఏర్పాటు చేసి, ఆ సోఫాపై రాహుల్ కూర్చోవడంపై కేంద్ర పౌర విమానయాన మంత్రి హర్దీప్‌ సింగ్‌ పూరి మాట్లాడుతూ టాక్టర్లపై సోఫాల్లో కూర్చొని ర్యాలీ చేయడం కాదని ట్వీట్ చేశారు. 

అంతేకాదు కాంగ్రెస్ నిరసన రైతుల్ని తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ ప్రారంభించిన నిరసన రైతుల కోసం వారి స్వార్ధ ప్రయోజనాల కోసమే. నిరసనంటే సోఫాల్లో కూర్చొని చేసేది కాదు. విద్యావంతులైన రైతుల్ని తప్పుదారి పట్టించేందుకు నిరసన ర్యాలీ అంటూ హర్దీప్ సింగ్ పూరి ట్వీట్ లో పేర్కొన్నారు.