సైబర్ సెక్యూరిటీ సంస్థ మాక్‌ఫీ విడుదల చేసిన ‘మోస్ట్ డేంజరస్ సెలబ్రిటీ’ బితాలో బాలీవుడ్ హీరోయిన్లు అగ్రస్థానంలో ఉన్నారు. వీరి పేర్లతో లింక్ చేయబడిన హానికరమైన సైట్ల వల్ల వీరందరూ ‘మోస్ట్ డేంజరస్ సెలబ్రిటీ’ జాబితాలో చేరారు.
వీరి పేర్ల మీద కొన్ని సైట్లు ఫ్రీ మెంబర్ షిప్, ఫ్రీ కంటెంట్ ఇస్తామంటూ కొన్ని యాడ్స్ ఇవ్వడంతో వినియోగదారులు ఆయా సైట్లను ఓపెన్ చేసి చిక్కుల్లో పడుతున్నారని వారించింది.
ఆ విధంగా వినియోగదారులను రిస్క్‌లో పడేసే సైట్లు పలువురు ప్రముఖులను, వారి పేర్లను వాడుకుంటున్నాయి. మోస్ట్ డేంజరస్ సెలబ్రిటీల జాబితాలో బాలీవుడ్ తారలు టబు, తాప్సీ పన్నూ, అనుష్క శర్మలు కూడా ఉన్నారు. మాక్‌ఫీ యొక్క మోస్ట్ డేంజరస్ సెలబ్రిటీ జాబితా 2020 యొక్క 14వ ఎడిషన్ షోబిజ్ నుంచి విడుదలయింది.
వినియోగదారులు మునుపెన్నడూ లేనంతగా ఉచిత వినోదం కోసం నెట్‌లో సెర్చ్ చేస్తుండటంతో సైబర్ క్రిమినల్స్ వారిని టార్గెట్ చేస్తున్నారని ఇంజనీరింగ్ వైస్ ప్రెసిడెంట్, మాక్‌ఫీ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ వెంకట్ కృష్ణపూర్ తెలిపారు.
మాక్‌ఫీ విడుదల చేసిన తాజా లిస్ట్ ప్రకారం గ్లోబల్ ఫుట్‌బాల్ సంచలనం క్రిస్టియానో రొనాల్డో మొదటి స్థానంలో ఉన్నాడు. ఆ తర్వాత తాజాగా “ఎ సూటిబుల్ బాయ్” యొక్క సిరీస్‌లో నటించిన టబు రెండో స్థానం, తప్పడ్ హీరోయిన్ తాప్సీ పన్నూ మూడో స్థానం, యాక్టర్ కమ్ ప్రొడ్యూసర్ అనుష్క శర్మ నాలుగోస్థానం, దబాంగ్ హీరోయిన్ సోనాక్షి సిన్హా ఐదో స్థానంలో ఉన్నారు.
గాయకుడు అర్మాన్ మాలిక్ ఆరవ స్థానం, యాక్టర్ సారా అలీ ఖాన్ ఏడవ స్థానం, సోప్ స్టార్ దివ్యంక త్రిపాఠి ఎనిమిదో స్థానం, బాలీవుడ్ సూపర్ స్టార్ షారూఖ్ ఖాన్ తొమ్మిదో స్థానం, ప్లేబ్యాక్ సింగర్ అరిజిత్ సింగ్ పదవ స్థానంలో ఉన్నారు.
వినియోగదారులు తరచూ స్పోర్ట్స్ ఈవెంట్స్, సినిమాలు, టీవీ షోలు, తమ అభిమాన ప్రముఖుల చిత్రాలు మరియు వీడియోలు వంటివి ఉచితంగా చూడటం కోసం ఆన్‌లైన్‌లో వెతుకుతుంటారు.
వినియోగదారులకున్న ఈ అలవాటును తమకు అనుకూలంగా మార్చుకొని సైబర్ క్రైమినల్స్ దాడులకు దిగుతున్నారు. వినియోగదారుల ఫోన్లు, కంప్యూటర్లలో మాల్వేర్‌ను ఇన్‌స్టాల్ చేస్తున్నారు.
తద్వార వినియోగదారుల వ్యక్తిగత సమాచారం ప్రమాదంలో పడే అవకాశం ఉందని ఈ సంస్థ హెచ్చరించింది. వినియోగదారులు ఉచిత కంటెంట్ కోసం రాజీపడితే వారు తమ డిజిటల్ జీవితాలను ప్రమాదంలో పడేసుకున్నట్లే అని వారించింది.
అభిమానులు అప్రమత్తంగా ఉండటం, ఉచిత కంటెంట్ ఇస్తామని వాగ్దానం చేసే అనుమానాస్పద లింక్‌లను నివారించడం లేదా ఆ లింక్‌లపై క్లిక్ చేయడానికి ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించడం చాలా అవసరం అని కృష్ణపూర్ స్పష్టం చేశారు.
More Stories
హిందూ వివాహం అంటే ఒక కాంట్రాక్ట్ కాదు
ఆధార్ ఉచిత అప్డేట్ గడువు మరోసారి పొడిగింపు
కఠువా ఎన్కౌంటర్లో ముగ్గురు ఉగ్రవాదులు హతం