మాజీ ఎంపీ, టీడీపీ నేత సబ్బం హరి ఇంటికి అనుకొని ఉన్న టాయిలెట్ గదిని జీవీఎంసీ అధికారులు కూల్చివేశారు. ప్రభుత్వానికి చెందిన స్థలాన్ని కబ్జా చేసి టాయిలెట్‌ను నిర్మించారని అధికారులు ఆరోపిస్తున్నారు. 12 అడుగుల పార్క్‌స్థలాన్ని ఆక్రమించి సొంత నిర్మాణాన్ని చేపట్టారని చెబుతున్నారు. అంతేకాకుండా మరికొంత ప్రభుత్వం స్థలం ఇంటి స్థలంలో కలిపేసుకున్నారని అంటున్నారు.
అక్రమ నిర్మాణన్ని తొలగించాలని నోటీసులు జారీచేసినా ఏమాత్రం పట్టించుకో పోవడంతో శనివారం ఉదయం జేసీబీతో వచ్చిన అధికారులు మాజీ ఎంపీకి ఝలక్ ఇచ్చారు. ప్రభుత్వ స్థలంలోని అక్రమ నిర్మాణాన్ని తొలగించారు. ఆక్రమించిన ఖాళీ స్థలంలో కంచె ఏర్పాటు చేశారు.
అయితే అక్కడి చేరుకున్న అధికారులపై సబ్బం హరి ఆగ్రహం వ్యక్తం చేశారు. ముందుగా సమాచారం ఇవ్వకుండా జేసీబీలతో ఎలా కూల్చివేస్తారని సబ్బం హరి అధికారులుపై మండిపడ్డారు.
More Stories
అమరావతి పాత టెండర్లు రద్దు
2027 జులై 23 నుంచి ఆగస్టు 3 వరకు గోదావరి పుష్కరాలు
అనకాపల్లి వద్ద రూ 1.40 కోట్లతో ఉక్కు కర్మాగారం