
బీహార్‌లో ఆర్జేడీ అధికారంలోకి వస్తే కిడ్నాప్‌లు, దోపిడీలే అధికమవుతాయని మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, బిజెపి బీహార్ ఎన్నికల ఇన్ ఛార్జ్ దేవేంద్ర ఫడ్నవిస్ హెచ్చరించారు.
ఆర్జేడీ అధికారంలోకి వస్తే 10 లక్షల ఉద్యోగాలకు మొదటి కేబినెట్‌లోనే ఆమోదిస్తామని తేజస్వీ యాదవ్ ప్రకటించారన, కానీ ఆ పది లక్షల ఉద్యోగాలు కేవలం క్రిమినల్స్‌కే అని ఫడ్నవీస్ ఎద్దేవా చేశారు.
ఎన్నికల ప్రచారం సందర్భంగా 10 లక్షల దేశీయ తుపాకులకు ఆర్డర్స్ ఇచ్చి.. నేరాలను ప్రోత్సహిస్తారని ఆరోపించారు. బీహార్‌లో మళ్లీ కిడ్నాప్‌లు, దోపిడీలు, దొంగతనాలు, హత్యలు, అత్యాచారాలు చూడక తప్పదని ప్రజలను హెచ్చరించారు.
లాలు ప్రసాద్ యాదవ్ పాలనలో బాలికలు బయటకు వెళ్లాలంటే భయపడేవారని, అంత క్రూరంగా వారి పాలన కొనసాగిందని గుర్తు చేశారు.
విద్యుత్, తాగునీటి విషయంలో ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారని చెబుతూ అదే ఎన్డీఏ ప్రభుత్వం బీహార్ ప్రజలకు అన్ని మౌలిక సదుపాయాలు కల్పించిందని ఫడ్నవీస్ తెలిపారు. అన్ని గ్రామాలను అభివృద్ధి చేశామని చెప్పుకొచ్చారు.
బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల కావడంతో ఎన్డీయే నేతలు ప్రచారాన్ని ముమ్మరంచేస్తున్నారు. ఎన్డీయేతర పార్టీలపై బీజేపీ నాయకులు విమర్శల దాడి చేస్తున్నారు.
More Stories
హిందూ సమాజ పునర్జీవనమే ఆర్ఎస్ఎస్ ఎజెండా
జస్టిస్ వర్మను దోషిగా చూపుతున్న నివేదిక!
మణిపూర్లో శాంతి పునరుద్ధరణలో పురోగతి