
మహారాష్ట్రలో మధ్యంత ఎన్నికలు జరగొచ్చని ఆ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు చంద్రకాంత్ పాటిల్ ప్రకటించి కలకలం సృష్టించారు. ప్రస్తుతం ఉన్న కూటమి ఎక్కువ రోజులు ఉండదని ఆయన జోస్యం చెప్పారు.
అయితే అధికారాన్ని ఏర్పాటు చేయడానికి తాము ఎట్టి పరిస్థితుల్లోనూ కాంగ్రెస్, ఎన్సీపీ, శివసేనల్లో ఏ ఒక్కరితో పొత్తు పెట్టుకోమని ఆయన స్పష్టం చేశారు.
‘‘పార్టీ అధినేతగా చెప్పేదేంటంటే.. శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీలతో మేం పొత్తు పెట్టుకోం. నిర్మాణాత్మకమైన ప్రతిపక్ష పాత్ర మాత్రమే పోషిస్తాం. అధికారం ఏర్పాటు చేయడం కోసం ఆ మూడు పార్టీలో ఏ ఒక్కరితోనూ పొత్తు పెట్టుకోము” అంటూ ఆయన ప్రకటించారు.
అయితే ప్రస్తుతం ఉన్న పొత్తు ఎక్కువ రోజులు ఉండకపోవచ్చని, త్వరలోనే కూలిపోతుందని భావిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. రాష్ట్రంలో మధ్యంతర ఎన్నికలు జరిగినా జరగొచ్చని అంటూ చంద్రకాంత్ పాటిల్ తెలిపారు
అయితే సంజయ్‌రౌత్‌తో మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ జరిపిన భేటీ గురించి ప్రస్తావించగా.. ‘‘దేవేంద్ర ఫడ్నవీస్‌ను ఇంటర్వ్యూకు సంజయ్ రౌత్ ఆహ్వానించారు. అయితే ఇంటర్వ్యూకి సంబంధించిన ప్రశ్నలను ముందుగా నాకు చూపించమని కోరాను. ఎలాంటి వివాదస్పద ప్రస్తావనలు అందులో ఉంకూడదు. ఇంతకు మించి ఏ రాజకీయ విషయాల గురించీ చర్చించలేదు’’ అని సమాధానం ఇచ్చారు.
More Stories
యాసిన్ మాలిక్‌కు మరణ శిక్ష విధించాలన్న ఎన్ఐఏ
అవినీతికి తావులేకుండా పారదర్శకంగా మోదీ పాలన
జులైలో చంద్రయాన్ – 3 ప్రయోగం