జీహెచ్‌ఎంసీ ఎన్నికలు ఈవీఎంల ద్వారానే జరగాలి

జీహెచ్‌ఎంసీ ఎన్నికలు ఈవీఎంల ద్వారానే జరగాలి
 
విద్యాధికులు ఎక్కువగా ఉన్న హైదరాబాద్‌లో జీహెచ్ఎంసీ ఎన్నికలు ఈవీఎలంతో నిర్వహించాలని బీజేపీ ఎమ్మెల్సీ రామచంద్రరావు డిమాండ్ చేశారు. మంగళవారం రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ను కలిసి బీజేపీ నేతలు జీహెచ్ఎంసీ ఎన్నికలను ఈవీఎంల ద్వారానే నిర్వహించాలని వినతి చేశారు.
హైదరాబాద్ నగరం కరోనాకు తీవ్రంగా ప్రభావితమైన నగరం కావడంతో బాలట్ పత్రాలతో ఓట్ వేయడం ప్రజలకు ప్రమాదకారి కాగరాలదని, ఈవీఎం లతో అయితే తొందరగా ఓట్ వేయడానికి వీలు ఏర్పడుతుందని బిజెపి నేతలు తెలిపారు.
అనంతరం రామచంద్రరావు మీడియాతో మాట్లాడుతూ ఓటమి భయంతోనే టీఆర్ఎస్, ఎంఐఎంలు బ్యాలెట్ పేపర్‌తో ఎన్నికలు నిర్వహించాలని కోరుతున్నాయని విమర్శించారు. బ్యాలెట్ పేపర్‌తో ఎన్నిక జరిగితే రిగ్గింగ్‌కు అవకాశముంటోందని ధ్వజమెత్తారు. ఐటీ రంగం అభివృద్ధి చెందిన హైదరాబాద్ ఎన్నికలు ఈవీఎంలతో నిర్వహించకపోవడం అర్థం లేనిది అని రామచంద్రరావు దుయ్యబట్టారు. 
కాగా, రానున్న జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అధునాతన‌ టెక్నాలజీని వినియోగిస్తామ‌ని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ పార్థసారథి తెలిపారు. రానున్న జిహెచ్ఎంసి ఎన్నికల నిర్వహణపై అధికారులతో పాటు ఎన్నికల సంఘం అధికారులతో సమావేశం నిర్వ‌హించారు.
కరోనా నేపథ్యంలో ఎన్నికలను శాంతియుత వాతావరణం లో నిర్వహించేందుకు సాంకేతిక పరిజ్ఞానం వినియోగిస్తామ‌ని చెప్పారు. ఓటర్ లిస్ట్‌తో పాటు, పోలింగ్ కేంద్రాన్ని ఆన్ లైన్ లో పొందుపరుస్తామ‌ని చెప్పారు నామినేషన్ నుంచి ఫలితాల వరకు మొత్తం ప్రక్రియను ఆన్ లైన్ లోనే నిర్వహిస్తామ‌ని తెలిపారు.