బంగ్లా ప్రధాని హసీనాకు మోదీ అపూర్వ కానుక 

బంగ్లా ప్రధాని హసీనాకు మోదీ అపూర్వ కానుక 
బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా పుట్టినరోజు సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సందేశంతోపాటు అరుదైన బహుమతిని పంపించారు.
 
 హసీనాకు తన తండ్రి బంగ్లాదేశ్ పితామహుడు షేక్ ముజిబూర్ రెహ్మాన్ 1972లో భారత పర్యటనకు వచ్చిన సందర్భంగా తీసిన అరుదైన వీడియో ఫుటేజీని బంగ్లాదేశ్ లో భారత హైకమిషనర్ రివా గంగూలీ దాస్ వ్యక్తిగతంగా హసీనాకు అందించారు.
 
ముజిబుర్ రెహ్మాన్ నాటి పర్యటనలో స్నేహం, సహకారం, శాంతిపై ఇండో బంగ్లా ఒప్పందంపై సంతకం చేశారు. 1971లో పాకిస్థాన్ తో యుద్ధం అనంతరం బంగ్లాదేశ్ స్వాతంత్ర్యం పొందిన తర్వాత రెహ్మాన్ 1972 మార్చిలో భారతదేశంలో పర్యటించారు.
‘‘మీ దూరదృష్టి, నాయకత్వం వల్ల బంగ్లాదేశ్ అపారమైన సామాజిక,ఆర్థిక పరివర్తనను సాధించడంలో సహాయపడింది… మా ద్వైపాక్షిక సంబంధాలకు మీ సహకారం ఎంతో ఆకట్టుకుంది’’ అని భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ బంగ్లాదేశ్ ప్రధాని హసీనా విధానాలను ప్రశంసిస్తూ లేఖ రాశారు.