పీఎం కేర్స్‌కు బ్యాంకుల ఉద్యోగులు రూ 200 కోట్లు  

కరోనావైరస్ వ్యాప్తితో పోరాటం కోసం ఏర్పాటు చేసిన కొత్త ట్రస్ట్ పీఎం-కేర్స్‌కు(ప్రధానమంత్రి పౌరుల సాయం, అత్యవసర పరిస్థితుల సహాయ నిధి) విరాళాలు భారీగా వ‌స్తున్నాయి.
ఆర్టీఐ ద్వారా సేక‌రించిన స‌మాచారం ప్ర‌కారం రిజ‌ర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియాతో పాటు ఏడు ప్ర‌భుత్వ రంగ సంస్థ బ్యాంకులు, ఇత‌ర ఆర్థిక సంస్థ‌లు క‌లిసి పీఎం కేర్స్‌కు రూ. 200 కోట్ల విరాళం ఇచ్చాయి.
ఆర్బీఐ రూ. 7.34 కోట్లు విరాళం ఇవ్వ‌గా, ఎస్బీఐ రూ. 107.95 కోట్లు త‌మ ఉద్యోగుల జీతాల్లో నుంచి విరాళంగా ఇచ్చింది. సీఎస్ఆర్, ఎల్ఐసీ, జీఐసీతో పాటు నేష‌న‌ల్ హౌసింగ్ బ్యాంకు క‌లిపి రూ. 144.5 కోట్లు విరాళంగా ఇచ్చారు.
కేవ‌లం ఎల్ఐసీనే రూ. 113.63 కోట్లు ఇవ్వ‌గా, అందులో ఉద్యోగుల జీతాల్లో నుంచి రూ. 8.64 కోట్లు, రూ. 100 కోట్లు కార్పొరేట్ క‌మ్యూనికేష‌న్ కింద‌, గోల్డెన్ జూబ్లీ ఫౌండేష‌న్ కింద రూ. 5 కోట్లు ఇచ్చింది. కేంద్ర విద్యా సంస్థ‌ల‌న్ని క‌లిసి రూ. 204.75 కోట్లు విరాళంగా ఇచ్చాయి.