లక్ష్మణ్ బాపూజీ నేటి తరానికి స్ఫూర్తిదాయకం  

స్వాతంత్య్ర సమరయోధుడు, నిజాం వ్యతిరేక ఉద్యమకారుడు, తొలిదశ తెలంగాణ ఉద్యమంలో ముందుండి పోరాడిన ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ  జీవితం నేటి తరానికి స్ఫూర్తిదాయకం అని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ కొనియాడారు. బాపూజీ 105 జయంతి సందర్భంగా ఆ మహనీయునికి ఆయనకు ఘనంగా నివాళులు అర్పించారు. 

తెలంగాణ తొలిదశ ఉద్యమంలో నిస్వార్థంగా పని చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ… తన మంత్రి పదవికి రాజీనామా చేసి ఉద్యమంలో ప్రజలతో కలిసి పోరాడారని గుర్తు చేశారు.  మలిదశ ఉద్యమంలోనూ క్రియాశీలకంగా పాల్గొంటూ యువతరానికి స్ఫూర్తిగా నిలిచారని చెప్పారు. 
 
ఎక్కడ ఏ కార్యక్రమం జరిగినా హాజరై.. తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని ఎలుగెత్తి చాటారని కొనియాడారు. బలహీన వర్గాల నుంచి బలమైన నేతగా ఎదిగిన బాపూజీ తెలంగాణ స్వరాష్ట్రం సాధన కోసం అవిశ్రాంతంగా పోరాడారని  కొనియాడారు. 
 
కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహాన్ని ట్యాంక్ బండ్ పై ఏర్పాటు చేస్తామని చెప్పిన సీఎం కేసీఆర్ తన హామీని మర్చిపోయారని ధ్వజమెత్తారు. నిజమైన తెలంగాణ ఉద్యమకారుల్ని మర్చిపోవడం బాధాకరం.పట్ల విచారం వ్యక్తం చేశారు.