“కేసీఆర్ నువ్వు హిందువే అయితే గోరక్షణ చేద్దాం రా, జిహాది లను కట్టడి చేద్దాం రా..” అంటూ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సవాల్ విసిరారు. దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా రఘునందన్ రావు పోటీ చేయనున్న క్రమంలో శనివారం నియోజకవర్గంలోని చేగుంట మండలంలో బీజేపీ రాష్ట్ర నేతలు రఘునందన్ రావు, మాజి ఎంపీ వివేక్ వెంకటస్వామి, ఎమ్మెల్యే రాజాసింగ్ పర్యటించారు.
ఈ సందర్భంగా గోషా మహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ మాట్లాడుతూ అధికార పార్టీ ఇచ్చే డబ్బులు తీసుకొని, ఓటు మాత్రం బీజేపీ కే వేయాలని సూచించారు. తాను పోటీ చేసిన నియోజకవర్గంలో అదే జరిగిందని చెప్పారు. తాను ఎక్కడికి వెళ్తే అక్కడ గెలిచామని, దుబ్బాకలో కూడ గెలుద్దామని రాజాసింగ్పిలుపు నిచ్చారు
నిజామాబాద్ ,కరీంనగర్ గెలిచినట్టు దుబ్బాక ను కూడా గెలుద్దామని ధీమా వ్యక్తం చేశారు. అసెంబ్లీ లో బీజేపీ ఎమ్మెల్యేగా తాను ఒక్కడినే ఉన్నానని, భాష సమస్య ఉన్నా కష్టపడి మాట్లాడుతున్నానని పేర్కొన్నారు. తనతో రఘునందన్ రావు కూడా ఉంటే ఎలా ఉంటుందో చూడండంటూ నియోజకవర్గ ప్రజలను ఉత్తేజ పరిచారు.
దేశంలో బిజేపి పాలన చూస్తున్నామని, ప్రధాని మోదీ పాలన లో దేశం ముందుకు వెళుతుందని తెలిపారు. కేంద్రం నుండి తెలంగాణ అబివృద్దికై కోట్ల రూపాయలు వస్తున్నా సీఎం కేసీఆర్ మాత్రం ఏమీ రావడం లేదంటూ ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు.
బంగారు తెలంగాణ అని చెప్పి.. రాష్ట్రాన్ని మత్తు తెలంగాణగా చేసి, తెలంగాణ యువతను తాగుబోతులుగా మార్చాడని దయ్యబట్టారు. ఎల్ఆర్ఎస్ స్కీమ్ తో మన రక్తం తాగుతున్నాడని.. పన్నుల రూపంలో నిజాం పైసలు గుంజినట్టు కేసీఆర్ గుంజుతున్నాడని మండిపడ్డాయిరు. దళితులకు ఇచ్చిన హామిలను నేరవెర్చని మోసగాడు కేసీఆర్ అని విమర్శించారు.
More Stories
తెలంగాణలో ఏపీ క్యాడర్ అధికారుకు ఏపీ వెళ్లాలని ఆదేశం
వర్గీకరణకు కమిషన్ పేరుతో ఉద్యోగ భర్తీకి ఎగనామం!
ఎస్సీ వర్గీకరణపై ఏక సభ్య జ్యుడీషియల్ కమిషన్