
బీజేపీ జాతీయ కార్యవర్గంలో మార్పులు చేర్పులు చేశారు. కొత్త బృందాన్ని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ప్రకటించారు. పార్టీ అధ్యక్షుడుగా జేపీ నడ్డా పదవీ బాధ్యతలు చేపట్టిన ఎనిమిది నెలల తర్వాత తొలిసారి ఈ నియామకాలు జరిపారు.
పలువురు కొత్త వారికి చేటు కల్పించారు. ముఖ్యంగా రాష్ట్రాల్లో నాయకత్వాన్ని అభివృద్ధి చేసే దిశగా నియామకాలు చేపట్టారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఈ మార్పులు చేర్పులు చోటుచేసుకోవడం విశేషం.రామ్ మాధవ్, మురళీధర్ రావు, అనిల్ జైన్‌లకు ప్రధాన కార్యదర్శుల బాధ్యతల నుండి తప్పించారు.
తెలంగాణ నుండి మాజీ మంత్రి డీకే అరుణను జాతీయ ఉపాధ్యక్షురాలిగా, మాజీ రాష్ట్ర అధ్యక్షుడు డా. కె లక్ష్మణ్ ను ఓబిసి మోర్చా అధ్యక్షుడిగా నియమించగా, ఆంధ్ర ప్రదేశ్ నుండి మాజీ కేంద్ర మంత్రి డి పురందేశ్వరిని జాతీయ ప్రధాన కార్యదర్శిగా, సత్యకుమార్ ను కార్యదర్శిగా నియమించారు.
ఉపాధ్యక్షులు: డా రమణ్ సింగ్, వసుందర రాజే సింధియా, రాధా మోహన్ సింగ్, బైజయంత్ జే పాండా, ముకుల్ రాయ్, శ్రీమతి రేఖ రాయ్, అన్నపూర్ణ దేవి, డా. భారతి బెన్ షియల్, డి కె అరుణ, ఎం చుబావో, బాదుల్లా కుట్టి
ప్రధాన కార్యదర్శులు: భూపేంద్ర యాదవ్, అరుణ్ సింగ్, కైలాష్ విజయవర్గియా, దుశ్యంత్ కుమార్ గౌతమ్, డి పురందేశ్వరి, సి టి రవి, తరుణ్ ఛుగ్, దిలీప్ సైకియా
ప్రధాన కార్యదర్శి (సంస్థాగతం): బి ఎల్ సంతోష్, సంయుక్త ప్రధాన కార్యదర్శి: వి సతీష్, సౌదాన్ సింగ్, శివప్రకాష్
కార్యదర్శులు: వినోద్ తవాడే, వినోద్ సొంకర్, బిస్వేసర్ తుడు, సత్యకుమార్, సునీల్ దేవోధర్, అరవింద్ మీనన్, హరీష్ డీవీడీ, పంకజ్ ముండే, ఓంప్రకాష్ దుర్వ్, అనుపమ్ హజారే, నరేంద్ర సింగ్, విజయ్ రహాటకర్, డా. అల్కా గుర్జార్
కోశాధికారి: రాజేష్ అగర్వాల్, సంయుక్త కోశాధికారి: సుధీర్ గుప్త, కార్యాలయ కార్యదర్శి: మహేంద్ర పాండే, ఐటి సోషల్ మీడియా: అమిత్ మాలవీయ.
మోర్చాల అధ్యక్షులు – యువ మోర్చా: తేజస్వి సూర్య, ఓబిసి మోర్చా : డా. కె లక్ష్మణ్, కిసాన్ మోర్చా: రాజకుమార్ చాహర్, ఎస్ సి మోర్చా: లాల్ సింగ్ ఆర్య, ఎస్ టి మోర్చా: సమీర్ ఒరాణ్, మైనారిటీ మోర్చా: జమాల్ సిద్దిఖ్యూ
అధికార ప్రతినిధులు: అనిల్ బాలుని, సంజయ్ మయూఖ్, డా. సంబిట్ పాత్ర, డా. సుధాన్షు త్రివేది, సయ్యద్ సహనావాజ్ హుస్సేన్, రాజీవ్ ప్రతాప్ రూడీ, నలిన్ ఎస్ కోహ్లీ, గౌరవ్ భాటియా, సైడ్ జాఫర్ ఇస్లాం, టామ్ వాడక్కన్, సంజు వర్మ, గోపాల్ కృష్ణ అగర్వాల్, ఇక్బాల్ సింగ్ లాల్ పుర, ఆర్ పి సింగ్, రాజ్యవర్ధన్ సింగ్ రాథోర్, అపరాజిత సారంగీ, హీనా గవిట్, గురుప్రకాష్, మహోన్లుమో కికోన్, సుశ్రి నుపుర్ శర్మ, రాజు బిష్ట, కె కె శ్రమా.
కొత్తగా నియమితులైన జాతీయ కార్యవర్గానికి ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ‘‘కొత్త టీమ్‌కు శుభాకాంక్షలు. పార్టీ సంప్రదాయాన్ని మోస్తూనే.. దేశ ప్రజలకు నిస్వార్థంగా, అంకితభావంతో సేవ చేస్తారని ధీమాగా ప్రకటిస్తున్నా. పేదలు, అట్టడుగు వర్గాల కోసం కష్టపడి పనిచేస్తారు’’ అని మోదీ ట్వీట్ చేశారు.
More Stories
చంద్రయాన్-5 మిషన్కు కేంద్రం ఆమోదం
బంగారు లక్ష్మణ్ కు ఘనంగా నివాళులు
దళారుల చేతుల్లో మోసపోతున్న తిరుమల భక్తులు