మధుర కృష్ణ మందిరం పక్క ఈద్గా స్థలంకై వాజ్యం 

దశాబ్దాల పోరాటం తర్వాత అయోధ్యలో రామ మందిర నిర్మాణం మొదలైన సంగతి తెలిసిందే. ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా రామాలయ భూమి పూజ జరిగింది. ఈ నేపథ్యంలో మరో వివాదం తెర పైకి వస్తోంది. 
 
ఈసారి ఉత్తర్ ప్రదేశ్, మధురలోని శ్రీ కృష్ణ మందిరానికి ఆనుకొని ఉన్న షాహీ ఈద్గాను తొలగించాలని మధుర సివిల్ కోర్టులో వ్యాజ్యం దాఖలైంది. బాలదేవత భగవాన్ శ్రీ కృష్ణ విరాజ్మాన్ ట్రస్టు సభ్యురాలు రంజనా అగ్నిహోత్రి వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. యూపీ సున్నీ వక్ఫ్ బోర్డు, షాహీ ఈద్గా ట్రస్ట్ మేనేజ్‌‌మెంట్ కమిటీని దీంట్లో ప్రతివాదులుగా చేర్చారు. 
 
వ్యాజ్యం ప్రకారం ఆలయానికి చెందిన 13.37 ఎకరాల భూమిని తిరిగి అప్పగించాలి. షాహీ ఈద్గా ట్రస్టు కొందరు ముస్లింల సాయంతో శ్రీ కృష్ణ జన్మస్థాన్ ట్రస్ట్‌కు చెందిన భూమిని ఆక్రమించి, ఒక నిర్మాణాన్ని ఏర్పాటు చేసిందని దావా పేర్కొంది. 
 
అదే సమయంలో ఈద్గా ట్రస్టుతో ఆలయ గవర్నింగ్ బాడీ అయిన శ్రీ కృష్ణ జన్మస్థాన్ సేవా సంస్థాన్‌‌ కుమ్మకై భూమిని మోసపూరితంగా రాజీ పడి అంగీకరించిందని దావా వివరించింది.  
 
శ్రీ కృష్ణ జన్మభూమి నిర్మాణ్ న్యాస్ ట్రస్ట్ ను ఆచార్య దేవమురారి బాపు అధ్యక్షుడిగా జులై 23న నమోదు చేశారు. 14 రాష్ట్రాల నుండి 11 మంది వీరిందవన్ తో సహా సుమారు 80 మంది సాధువులతో ఏర్పాటు చేశారు. 
 
శ్రీ కృష్ణ జన్మభూమి విముక్తి కోసం దేశంలోని సాదు, సంతతులు అందరిని సమీకరిస్తూ సంతకాల సేకరణ చేస్తున్నట్లు ప్రకటించారు. ఆ తర్వాత దేశ వ్యాప్తంగా ఉద్యమం చేబడతామని తెలిపారు. 
 
మధురలో గల ప్రాచీన కేశవనాథ్ దేవాలయాన్ని కూలగొట్టి ఔరంగజేబు 1669లో షాహీ ఈద్గాహ్ మసీదును నిర్మించారు. రామజన్మభూమి గురించి సుప్రీం కోర్ట్ ను సానుకూల ఆదేశాలు లభించడంతో మధుర విషయంలో సహితం సానుకూలత లభించగలదని ఆశిస్తున్నారు.