జమ్మూ కాశ్మీర్‌లో నిన్న రాత్రి మరోసారి భూకంపం సంభవించింది. మంగళవారం రాత్రి 9.40 గంటలకు శ్రీనగర్, బుద్గాం, గందేర్బల్ సహా పరిసర జిల్లాల్లో భూమి కంపించింది. దీని తీవ్రత 3.6 గా నమోదయినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ ప్రకటించింది.
శ్రీనగర్ సమీపంలోని భూఅంతర్భాగంలో 5 కిలోమీటర్ల లోపల ప్రకంపనల కేంద్రం ఉందని తెలిపింది. నిన్న రాత్రి 9.40 గంటలకు భూకంపం వచ్చిందని ఎన్సీఎస్ వెల్లడించింది. ఈ ప్రకంపనలతో ప్రజలు తీవ్ర ఆందోళన చెంది, ఇళ్ల నుంచి వీధుల్లోకి పరుగులు తీశారు. రాత్రంతా వీధుల్లోనే గడిపారు.
”ఇది చాలా భయాన్ని కలిగించింది. ప్రతి ఒక్కరూ క్షేమంగానే ఉన్నారని అనుకుంటున్నాను” అని శ్రీనగర్ జిల్లా మేజిస్ట్రేట్ షాహీద్ చౌధురి తన ట్విట్టర్ ఖాతాలో వ్యాఖ్యానించారు.
ఇక తాము ఎదుర్కొన్న పరిస్థితి గురించి పలువురు సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టారు. కొన్ని ప్రాంతాల్లో ఆస్తి నష్టం కూడా సంభవించిందని తెలుస్తుండగా,
ఈ భూ ప్రకంపనల వల్ల ఎలాంటి ప్రాణ, ఆస్తినష్టం సంభవించలేదని జమ్మూకశ్మీర్ అధికారులు చెప్పారు.
More Stories
గోమాత విజ్ఞాన పరీక్షా పోస్టర్ ఆవిష్కరించిన భగవత్
ఉత్కంఠ పోరులో పాక్ పై భారత్ జయకేతనం
హర్యానాలో కాంగ్రెస్ అంటున్న ఎగ్జిట్ పోల్స్.. బిజెపి ధీమా