హిందీలో ఒక సామెత ఉంది. `ఉల్టా చోర్ కొత్వాల్ కో దాంటే’ (పోలీస్ ను దొంగ అని దొంగ పిలవడం). సుదీర్ఘకాలం అధికారంలో ఉండడంతో కాంగ్రెస్ ఇటువంటి అలవాటులో ఆరితేరింది.
తాను చాలా విభజిత చట్టాలను తీసుకు వచ్చినప్పటికీ బిజెపిని మాత్రం మతతత్వ పార్టీగా ముద్ర వేయడంలో ఒక విధంగా కాంగ్రెస్ విజయం సాధించింది. దేశంలో అత్యవసర పరిస్థితికి కారణమైన కాంగ్రెస్ పార్టీ బిజెపిని ఫాసిస్ట్ అని ఆరోపిస్తుంది. ఆ కాలంలోనే మానవ హక్కుల ఉల్లంఘనలు తీవ్రంగా జరిగాయి. అధ్వాన్నమైన కుల ఆధారిత రాజకీయాలను నడుపుతూ బీజేపిని కులతత్వమని ఆరోపిస్తున్నది.
అదే కాంగ్రెస్ పార్టీ ఇటీవల ఫేస్‌బుక్ బిజెపికి అనుకూలంగా ఉందని ఆరోపించినప్పుడు ఆశ్చర్యపోనవసరం లేదు. ట్విట్టర్, ఫేస్‌బుక్, గూగుల్ వంటి ప్రాముఖ్యత ఉన్న అన్ని అగ్రశ్రేణి సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లు అమెరికాలో వామపక్ష భావాలు గలవారితో నిండి ఉన్నాయి. వారంతా కాంగ్రెస్ పార్టీ సైద్ధాంతిక ప్రయాణికులు కావడమే కాకుండా, బిజెపి పట్ల వారికి ఎటువంటి ప్రేమ ఉండదు.
ఈ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ల ద్వారా ఉన్నత పదవులు పొందిన చాలా మంది భారతీయ అధికారులు కూడా అధికార పార్టీ పట్ల ధిక్కార ధోరణినే అనుసరిస్తున్నారు. ఫేస్‌బుక్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ అజిత్ మోహన్ పార్లమెంటరీ కమిటీలో ఆ అంశాన్ని అంగీకరించారు.
తాను ఇంతకు ముందు కేంద్రాలలో కాంగ్రెస్ కోసం పని చేయడమే కాకుండా యుపిఎ -2 ప్రభుత్వంలో ప్రణాళికా సంఘం, పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖలలో కన్సల్టెంట్ గా పనిచేసిన్నట్లు వెల్లడించారు.
2019 లోక్‌సభ ఎన్నికలకు ముందే, ఫేస్‌బుక్ అప్పటి భారతదేశ వార్తా భాగస్వామ్య అధిపతి మనీష్ ఖండూరి కాంగ్రెస్‌లో చేరారు, వెంటనే ఉత్తరాఖండ్‌లోని ఒక నియోజకవర్గం నుండి టికెట్‌తో బహుమతి పొందారు. భారీ ఎన్నికల ఓటమిని చవిచూసినప్పటికీ, ఖండూరి పార్టీ సోషల్ మీడియా యూనిట్ సమన్వయకర్తగా ఎదిగారు.
ఫేస్‌బుక్‌లోని ఇంటర్నేషనల్ ఫాక్ట్ చెకింగ్ నెట్‌వర్క్ కమిటీ అధిపతి కాంచన్ కౌర్, బిజెపికి, ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా పదేపదే “అవమానకరమైన భాష” వాడుతున్నారని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.
అదే కమిటీ ఇస్లామో-లెఫ్టిస్ట్ ప్రచార వెబ్‌సైట్ ఆల్ట్-న్యూస్‌ను ఆమోదించింది. విశ్వసనీయ సభ్యుడిగా, ఒపిండియా, ఫాక్ట్‌హంట్ వంటి మితవాద మధ్య-కుడి సంస్థలను తిరస్కరించింది.
ప్రొఫెసర్ కౌర్ ఆల్ట్- న్యూస్ తో వెబ్‌కాస్ట్ చర్చకు గత మేలో హాజరయ్యారు. ఆ న్యూస్ వ్యవస్థాపకుడు ప్రతిక్ సిన్హాకు ప్రధాని మోదీ పట్ల గల విద్వేషం గురించి వేరే చెప్పనవసరం లేదు. ఆ వెబ్‌కాస్ట్‌కు గూగుల్ అధికారికంగా మద్దతు ఇచ్చింది.
అంతే కాదు, 2018లో, ఎన్నికల ప్రయోజనాల కోసం మిలియన్ల మంది ఫేస్‌బుక్ వినియోగదారుల డేటాను దుర్వినియోగం చేసిన యుకెకు చెందిన కేంబ్రిడ్జ్ ఎనలిటికాకు క్లయింట్‌గా కాంగ్రెస్ తప్పుకుంది.
2014 నుండి 2018 మధ్య, ట్విట్టర్ ఇండియాకు న్యూస్, పాలిటిక్స్, గవర్నమెంట్ అధిపతిగా కాశ్మీరీ జర్నలిస్ట్ రహీల్ ఖుర్షీద్ ఉన్నారు. అతను బిజెపి అనుకూల ఖాతాలకు వ్యతిరేకంగా పక్షపాత ధోరణి ఆవలంభించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అయితే వామపక్షవాదుల పట్ల మాత్రం ఉదారంగా వ్యవహరించేవాడు.
అతను 2014 లో నియమితుడైనప్పుడు, అతని మోదీ వ్యతిరేక, హిందూ వ్యతిరేక, కాశ్మీర్ అనుకూల వేర్పాటువాదుల వైఖరిని ఆరోపిస్తూ చాలామంది అతని పాత పోస్టులను ఎత్తి చూపారు.
కొంతమంది ట్విట్టర్ వినియోగదారులు ట్విట్టర్ ఇండియాలో పాలసీ డైరెక్టర్ మహీమా కౌల్ యొక్క రాజకీయ మొగ్గును బహిర్గతం చేయడం ప్రారంభించినప్పుడు, ఆమె తన పాత ట్వీట్లను రాహుల్ గాంధీ, కాంగ్రెస్ ను ప్రశంసిస్తూ, మోదీకి వ్యతిరేకంగా ద్వేషపూరిత వ్యాఖ్యలను చూపించింది.
“బాంబులు, భూకంపాలు, మరణాలు అన్నీ నరేంద్ర మోదీ ఆశయాలకు రెండవవి”. ఆమె తొలగించిన ట్వీట్లలో ఒకటి చదవండి. కాంగ్రెస్ అనుకూల, మోదీ వ్యతిరేకమని ఈ సోషల్ మీడియా దిగ్గజాల వద్ద ఎవరూ తమ ఉద్యోగాన్ని కోల్పోలేదని ఈ సందర్భంగా వేరే చెప్పనవసరం లేదు.
ఒక ఫేస్‌బుక్ ఉద్యోగి ఆంకీ దాస్ కాంగ్రెస్-వామపక్ష పర్యావరణ వ్యవస్థ సమస్యాత్మకంగా ఉందని ఆరోపించిన పోస్టులు, ప్రొఫైళ్ళను తొలగించడానికి నిరాకరించడంతో ఆగ్రవేశాలతో కాంగ్రెస్ వారు ఇప్పుడు తుపాకులు ఎక్కుపెట్టడం జరిగింది.
కాంగ్రెస్ ట్రోల్‌ల నుండి రాహుల్ గాంధీ వరకు అందరూ ఫేస్‌బుక్‌లో భారతదేశంలో రాజకీయ నాయకుల జోక్యం ఉందని, బిజెపి పక్షాన ఉన్నారని ఆరోపించారు.
వీరు సహనం గురించి మాట్లాడుతుంటారు. ఈ సోషల్ మీడియాలో కాంగ్రెస్, వామపక్ష వ్యక్తులు వ్యవహారాల అధికారంలో ఉన్నంత కాలం ఇది చాలా మంచిది. కాని కొంచెం బిజెపి వైపు మొగ్గు చూపే వాటిని తొలగించమని కాంగ్రెస్ ఇచ్చిన ‘ఉత్తర్వుల’ను ఒక సారి నిరాకరించేసరికి వారు తట్టుకోలేక పోతున్నారు.
కానీ అది కాంగ్రెస్ వ్యూహం. బిజెపి తనను పదేపదే కదిలిస్తే తప్ప స్పందించదు. కానీ కాంగ్రెస్ తన ఆసక్తికి వ్యతిరేకంగా స్వల్పంగా ఏమి జరిగినా తట్టుకోలేదు. ప్రతిపక్షంలో ఉండి కూడా ఇంకా పాలక పార్టీ మనస్తత్వాన్ని చూపిస్తుంది. అయితే బిజెపి అధికారంలో ఉన్నప్పటికీ ప్రతిపక్ష మనస్తత్వాన్ని ప్రదర్శిస్తుంది.
కానీ ఇప్పుడు, మందపాటి చర్మం గల బిజెపి కూడా కాంగ్రెస్ యొక్క వ్యూహాలతో చిరాకు పడినట్లు స్పష్టం అవుతుంది. దానితో కేంద్ర ఐటి మంత్రి రవిశంకర్ ప్రసాద్ ఫేస్‌బుక్ సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్‌కు తీవ్రంగా ఓ లేఖ రాశారు.
2019 సార్వత్రిక ఎన్నికల వరకు ఫేస్‌బుక్ ఇండియా యాజమాన్యం పేజీలకు పేజీలు తొలగించడం లేదా వాటి పరిధిని గణనీయంగా తగ్గించడం కోసం గట్టి ప్రయత్నం చేసింది. “ఇటువంటి పక్షపాతం, నిష్క్రియాత్మక కేసులు మీ ఫేస్ బుక్ ఇండియా జట్టులోని వ్యక్తుల ఆధిపత్య రాజకీయ నమ్మకాల యొక్క ప్రత్యక్ష ఫలితం” అని ప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. .
ఫేస్ బుక్ ఇండియా బృందం “ఒక నిర్దిష్ట రాజకీయ నమ్మకానికి చెందిన వ్యక్తులచే ఆధిపత్యం చెలాయిస్తుంది” అని మంత్రి ఆరోపించారు. ఇది ఒక భావజాలం, దీనిని బ్యాలెట్ వద్ద భారత ప్రజలు సమగ్రంగా ఓడించారని ఆయన గుర్తు చేశారు.
ఏదేమైనా, ఈ వైఖరి గల ప్రజలు “ముఖ్యమైన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ల యొక్క నిర్ణయాత్మక ఉపకరణంలో ఆధిపత్యం చెలాయించడం ద్వారా భారతదేశ ప్రజాస్వామ్య ప్రక్రియను కించపరచడానికి ప్రయత్నిస్తున్నారు” అని ప్రసాద్ అభ్యంతరం వ్యక్తం చేశారు.
పేస్ బుక్ ఇండియాలో పనిచేస్తున్నప్పుడు, ముఖ్యమైన పదవులను నిర్వహిస్తున్నప్పుడు పేస్ బుక్ ఉద్యోగులు ప్రధానమంత్రి, భారత సీనియర్ క్యాబినెట్ మంత్రులను కించపరిచే విధంగా తమ అధికారాన్ని దుర్వినియోగం చేసినట్లు కేంద్ర మంత్రి జుకర్బర్గ్ దృష్టికి తీసుకు వచ్చారు.
అంతేకాకుండా, విశ్వసనీయత లేని, సోషల్ మీడియాలో ప్రజలచే క్రమం తప్పకుండా వాస్తవంగా తనిఖీ చేయబడే పేస్ బుక్ అవుట్సోర్సింగ్ ఫాక్ట్-చెకింగ్ సమస్యను ప్రసాద్ సరిగ్గా లేవనెత్తారు. కాంగ్రెస్, వామపక్షాలు ‘అల్టా చోర్ కొత్వాల్ కో డాంటే’ వ్యూహాలను ఎందుకు ఉపయోగిస్తున్నాయో అనే అంశంపై మూలలను ప్రసాద్ తన లేఖలో వివరించారు.
ఇటీవలి అనామక, మూల-ఆధారిత నివేదికల గురించి తమ సంస్థలో జరిగిన అంతర్గత వివాదం సైద్ధాంతిక ఆధిపత్యం కోసం జరిగిన రాద్ధాంతం తప్ప మరొకటి కాదని ప్రసాద్ స్పష్టం చేశారు.
ఫేస్‌బుక్‌లో బిజెపి అనుకూల పక్షపాతం యొక్క అవగాహన (పూర్తిగా వ్యతిరేక వాస్తవికత ఉన్నప్పటికీ) సృష్టించబడింది మాత్రమే. తద్వారా ప్లాట్‌ఫాం కోసం పనిచేసే తటస్థ లేదా మధ్య-కుడి స్వరాలను వామపక్షాలు తొలగించే ప్రయత్నం చేస్తున్నాయి.
విచారకరం ఏమిటంటే కేంద్ర మంత్రి ప్రసాద్ లేఖను ఫిర్యాదుల జాబితాలో చేరడం మినహా పొరపాట్లను సరిచేసే, పక్షపాతాన్ని నిరోధించే ప్రయత్నం చేయకపోవడం గమనార్హం. భారత ప్రభుత్వం తన స్థానిక రాజకీయాల్లో విదేశీ వేదికల జోక్యాన్ని అనుమతించదని ఈ సందర్భంగా జుకర్‌బర్గ్ గ్రహించవలసి ఉంటుంది. అటువంటి ప్రయత్నం చేస్తున్న అనేక చైనా యాప్ లను నిషేధించడం కనువిప్పు కావాలి.
పేస్ బుక్ ఎటువంటి భావజాలం వైపు మొగ్గు చూపకుండా, భారత చట్టాలకు వ్యతిరేకమైతే తప్ప ఎటువంటి పోస్ట్ లను సెన్సార్ చేసే ప్రయత్నం చేయరాదు.
More Stories
సామరస్యంతోఅస్పృస్యతను పూర్తిగా నిర్ములించాలి
డొనాల్డ్ ట్రంప్ సమీపంలో కాల్పులు.. మరోసారి హత్యాయత్నం?
సినీ నటి జేత్వాని వేధింపుల కేసులో ముగ్గురు ఐపీఎస్‌లపై వేటు