
వై ఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి పదవి చేపట్టినప్పటి నుండి తిరుమలలో అన్యమతస్థులు ఆధిపత్యంపై వివాదాలు చెలరేగుతూనే ఉన్నాయి. తాజాగా టిడిడి ట్రస్ట్ బోర్డు చైర్మన్ వైవి సుబ్బారెడ్డి ఏకంగా అన్యమతస్థులు శ్రీవారి దర్శనం కోసం వస్తే ఎటువంటి డిక్లరేషన్ ఇవ్వనవసరం లేదని చెప్పడంతో పెద్ద దుమారం చెలరేగింది.
ఈ దుమారాన్ని చల్లబరచడం కోసం తాను ఆ విధంగా అనలేదని, కేవలం ఎవ్వరు డిక్లరేషన్ ఇవ్వడం లేదని మాత్రమే చెప్పానని అంటూ వివరణ ఇచ్చారు. పైగా ముఖ్యమంత్రి వై ఎస్ జగన్మోహన్ రెడ్డి తిరుమలకు వస్తే ఆ విధమైన డిక్లరేషన్ ఇవ్వనవసరం లేదని కూడా స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి శ్రీవారి భక్తుడని చెప్పడం కోసం తీవ్ర ప్రయత్నం చేశారు. అయితే సుదీర్ఘకాలంగా అమలులో ఉన్న టిటిడి నిబంధనలను గాలికి వదిలివేసి, సొంత నిబంధనలను ఆయన ప్రవేశ పెడుతున్నారా అనే అనుమానాలు ఈ సందర్భంగా కలుగుతున్నాయి.
టిటిడి నిబంధనల ప్రకారం జగన్మోహన్ రెడ్డి ఏ మతస్థుడో అనే విషయాన్నీ మాత్రం దాటవేస్తున్నారు. ఆయన పాలనలో రాష్ట్రంలో పలు ప్రాంతాలలో వరుసగా దేవాలయాలపై దాడులు జరుగుతున్నా, విగ్రహాలు, రథాలు ధ్వసం, అపహరణ జరుగుతున్నా పల్లెత్తు మాట ముఖ్యమంత్రి అనకపోవడం గమనార్హం.
తన పాలనలో హిందువులకు, వారి ఆరాధ్య దైవాలకు భద్రత ఉంటుందనే భరోసా కూడా జగన్ ఇవ్వడం లేదు. పైగా సంపన్న దేవాలయాల ఆదాయాలను ప్రభుత్వ నిధులలోకి మళ్లించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. తిరుమల, శ్రీశైలంలలో తిష్ట వేసుకున్న క్రైస్తవులను తరలించే ప్రయత్నం చేయడం లేదు.
గతంలో ఎన్నికల ముందు స్వరూపానంద స్వామి వారి ఆధ్వర్యంలో జగన్మోహన్ రెడ్డిగా హిందువుగా మారిన్నట్లు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. తర్వాత ఆ స్వామి గారు జరిపిన కార్యక్రమంలొ హిందూమత ఆచారం ప్రకారం పాల్గన్న కార్యక్రమాలలో పాల్గొన్నారు.
అయితే ఆయన ఇంట్లో క్రైస్తవ ఆచారాలను మాత్రమే పాటిస్తున్నారు. ప్రభుత్వంలో క్రైస్తవులకు విశేష ప్రాధాన్యత కల్పిస్తున్నారు. పలు కీలక పోస్టింగ్ లను అప్పజెప్పుతున్నారు. సొంత పార్టీలోనే ఈ విషయమై నేతలు గుసగుసలు ఆడుతున్నా ఎదురుగా మాట్లాడలేక పోతున్నారు.
స్వయంగా తమ ప్రభుత్వం క్రైస్తవులకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఒక కలెక్టర్ చెబుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దానితో సుబ్బారెడ్డి టిటిడి చట్టం ప్రకారం ఆలయ పాలన సాగిస్తారా, లేదా వాటికి తమదైన భాష్యం చెప్పి ప్రజలను మభ్యపరచే ప్రయత్నం చేస్తారా?
అన్యమతస్తులు స్వామివారిని దర్శిచుకోవాలంటే డిక్లరేషన్ ఇవ్వాలని చట్టం చెబుతుంటే, గతంలొ సోనియాగాంధీ, రాజశేఖర్ రెడ్డిలు డిక్లరేషన్ ఇవ్వలేదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి కూడా ఇవ్వనక్కర్లేదని ఆయన సర్టిఫికెట్ ఇవ్వడం విస్మయం కలిగిస్తుంది.
గతంలో భారత్ రాష్ట్రపతి అబ్దుల్ కలామ్ డిక్లరేషన్ ఇచ్చి స్వామి వారిని దర్శనం చేసుకున్న విషయాన్నీ మరచిపోయారా? ప్రస్తుత ప్రభుత్వంకు హిందువుల విశ్వాసాలు, సంప్రదాయాల పట్ల విశ్వాసం లేదని, వాటిని పట్టించుకోనవసరం లేదని సుబ్బారెడ్డి చెప్పకనే చెప్పుతున్నట్లున్నది.
డిక్లరేషన్ అక్కర్లేదనడం ఆధ్యాత్మిక ద్రోహమని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విమర్శించారు. అనాదిగా వస్తున్న సంప్రదాయాన్ని మార్చడం సరికాదని స్పష్టం చేశారు.
కాగా, అందరూ డిక్లరేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదని టిటిడి ఛైర్మన్ అనలేదని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పష్టం చేశారు. గతంలో సిఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి తన పాలనా కాలంలో ఎలాంటి డిక్లరేషన్ ఇవ్వలేదని, 5 సంవత్సరాలు స్వామి వారికి పట్టువస్త్రాలు ఇచ్చారని, ఇప్పుడు ఆయన కుమారుడు వైఎస్.జగన్ డిక్లరేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.
More Stories
బీజేపీలో చేరిన కీలక జనసేన నేత
ఔట్ సోర్సింగ్ నియామకాలతోనే పేపర్ లీకేజి!
కరోనా కథ ఇంకా ముగియలేదు .. ప్రధాని హెచ్చరిక