
పాకిస్తాన్‌లో ప్రతిపక్షాలు ఏకమవుతున్నాయి. ప్రధాని పీఠంపై నుంచి ఇమ్రాన్ ఖాన్ ను దించేందుకు అన్ని పార్టీల నాయకులు ఒక్కటవుతున్నారు. ఈ విషయమై చర్చించేందుకు ఆదివారం అఖిలపక్ష సదస్సు నిర్వహించబోతున్నారు.
మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ కూడా వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ఈ సదస్సులో పాల్గొంటారు. ఇమ్రాన్ ఖాన్ తక్షణమే రాజీనామా చేయాలని ప్రతిపక్షాలు గట్టిగా డిమాండ్ చేయబోతున్నాయి.
ప్రతిపక్షంలోని ప్రతి పెద్ద నాయకుడిపై ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం కేసు నమోదు చేసింది. చాలా కేసులు అవినీతికి సంబంధించినవి. ఈ విషయమై పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ (పీపీపీ) చైర్మన్ బిలావల్ భుట్టో జర్దారీ మే నుంచి నాయకులందరినీ ఒకే వేదికపైకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. నవాజ్ షరీఫ్ కుమార్తె మరియం నవాజ్‌తో చాలాసార్లు భేటీ అయ్యారు.
మరో ప్రతిపక్ష నాయకుడు మౌలానా ఫజల్-ఉర్-రెహ్మాన్ కూడా బిలావల్, నవాజ్ లతో టచ్ లో ఉన్నారు. గత మే నెలలో బిలావల్ నివాసంలో సమావేశమైన మాజీ ప్రధాని షాహిద్ ఖాకిన్ అబ్బాసీ, మరియం నవాజ్ ఒకసారి చర్చించారు. దీనిపై చర్చించి కార్యాచరణ చేపట్టేందుకు ఆదివారం మరోసారి సమావేశం కానున్నారు.
ఈ సదస్సులో లండన్ లో చికిత్స పొందుతున్న మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ కూడా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొననున్నారు. బిలావాల్ శుక్రవారం నవాజ్‌తో ఫోన్ లో సంభాషించారు. అనంతరం మరియం, మౌలానా రెహ్మాన్‌తో బిలావల్ సమావేశమైనట్లు సమాచారం. అఖిలపక్ష సదస్సు ఆదివారం జరుగుతుందని బిలావల్ భుట్టో జర్దారీ ట్వీట్ ద్వారా సమాచారమిచ్చారు.
More Stories
క్రిమియాను రష్యాకు వదులుకునేందుకు ఉక్రెయిన్ విముఖం
విద్యార్థుల వీసాల విషయంలో వెనక్కి తగ్గిన ట్రంప్
పోప్ అంత్యక్రియలకు ముర్ము, ట్రంప్ సహా 2 లక్షల మంది హాజరు