తైవాన్ లోకి చొరబడేందుకు చైనా కుయుక్తులు 

భారత సరిహద్దులో చొరబాట్లకు ప్రయత్నిస్తున్న చైనా మరోవైపు తైవాన్ లోకి కూడా చొరబడేందుకు కుయుక్తులు పన్నుతున్నది. చైనాకు చెందిన 18 యుద్ధ విమానాలు శుక్రవారం సాయంత్రం తైవాన్ గగనతలంలోకి ప్రవేశించాయి. ఇది అమెరికా, తైవాన్లకు తీవ్ర హెచ్చరిక అని పేర్కొన్నది. 
 
చైనా ఫైటర్ జెట్‌లు తైవాన్ ఆకాశంలో ఎగురుతుండగా  అప్పటి అమెరికా అండర్ సెక్రటరీ కీత్ క్రెచ్ తైపీలో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొనడం విశేషం. భారత్ తర్వాత చైనా తైవాన్ తో ఘర్షణకు దిగుతున్నది. తైవాన్ లోకి చొరబడేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నది. చైనాకు చెందిన 18 యుద్ధ విమానాలు తైవాన్ గగనతలంలోకి ప్రవేశించాయి. 
 
తైవానీస్ సరిహద్దు నుంచి తిరిగి రాగానే చైనా రక్షణ మంత్రిత్వ శాఖ సీనియర్ అధికారి కల్నల్ రెన్ గుయోకియాంగ్ పేరిట ప్రకటన వెలువడింది. అగ్నితో ఆటలాడటానికి ప్రయత్నిస్తున్న వ్యక్తులు కాలిపోతారని, మా వైపు నుంచి ఇది అమెరికా, తైవాన్ రెండింటికీ హెచ్చరిక అని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. భారతదేశం తరువాత చైనా ఇప్పుడు తైవాన్లోకి చొరబడటానికి ప్రయత్నిస్తున్నది. 
 
జూన్ నుంచి చైనా లడఖ్ సరిహద్దులోకి చొరబడటానికి ప్రయత్నిస్తున్నది. భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోదీతో పాటు 10,000 మందిపై చైనా గూఢచర్యం చేసినట్లు వార్తలు కూడా వచ్చాయి. 
 
తైవాన్ తో అమెరికా సంబంధాలు పెరుగుతున్న నేపథ్యంలో గల్ఫ్ ఆఫ్ తైవాన్, దక్షిణ చైనా సముద్రంలో జిన్‌పింగ్ ప్రభుత్వం చిన్న దేశాలపై ఒత్తిడిని పెంచుతున్నది. తైవాన్ స్వతంత్ర దేశమైనప్పటికీ.. చైనా ప్రభుత్వం మాత్రం తైవాన్‌ను తన వాటాగా భావిస్తుంది. ఈ విషయంలో తైవాన్‌తో అమెరికా బహిరంగంగా నిలబడింది. 
 
ఇరు దేశాల మధ్య బిలియన్ డాలర్ల రక్షణ ఒప్పందం కూడా జరగబోతున్నది. తైవాన్ యొక్క వాయు, సముద్ర సరిహద్దును కొన్ని నెలలుగా చైనా ఉల్లంఘిస్తున్నది. అయితే, తొలిసారిగా ఇంత పెద్ద సంఖ్యలో ఫైటర్ జెట్‌లు తైవాన్ సరిహద్దులోకి ప్రవేశించడం కొంత ఆందోళన కలిగించే విషయమే. 
 
అదే సమయంలో తైవాన్ తన వాయు రక్షణ క్షిపణి వ్యవస్థను చురుకుగా ఉంచడంతో చైనా విమానాలు వెంటనే తిరిగి వచ్చేశాయి. బుధవారం కూడా చైనాకు చెందిన రెండు యుద్ధ విమానాలు తైవాన్ వాయు సరిహద్దులోకి చొరబడినట్లుగా గుర్తించారు. 
 
రెండు నెలల్లో డొనాల్డ్ ట్రంప్ ఒక మంత్రిత్వ శాఖ అధికారిని తైవాన్‌కు పంపడం ఇది రెండోసారి. 1979 నుంచి అమెరికాకు చెందిన ఏ పెద్ద అధికారి తైవాన్‌ను సందర్శించలేదు. అయితే, ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలు మాత్రం కొనసాగుతున్నాయి. చైనా చర్యపై అమెరికా ఇంకా స్పందించలేదు.