
నాసిరకం ఎగుమతులను పెద్ద ఎత్తున ఇతర దేశాలకు పంపే చైనాకు, భారత్ మరో షాక్ ఇచ్చింది. దేశంలోకి దిగుమతి చేసుకునే అన్ని ఎల్‌ఈడీలకు, వాటి తయారీ పరికరాలకు నమూనా పరీక్షల్ని తప్పనిసరి చేస్తున్నట్లు కేంద్రం తాజాగా ప్రకటించింది.
ఈ మేరకు విదేశీ వాణిజ్యం డైరెక్టర్ జనరల్(డీజీఎ్‌ఫటీ) తాజాగా ఒక నోటిఫికేషన్‌ను జారీ చేసింది. విదేశాల నుంచి వచ్చే ప్రతి ఎల్‌ఈడీ ఉత్పత్తికీ కఠినమైన నాణ్యత పరీక్షలు నిర్వహించనున్నట్లు అందులో పేర్కొంది.
ఎల్‌ఈడీ ఉత్పత్తులకు భారత్ ప్రపంచంలోనే రెండో అతిపెద్ద మార్కెట్. ఈ నేపథ్యంలో భారత్‌కు ఎలకా్ట్రనిక్ ఉత్పత్తుల్ని భారీగా ఎగుమతి చేసే చైనాకు తాజా నిబంధనతో షాక్ తగిలినట్లేనని పరిశీలకులు చెబుతున్నారు.
డీజీఎ్‌ఫటీ నోటిఫికేషన్ ప్రకారం అధికారుల బృందం భారత్‌లోని ప్రధాన రేవులకు చేరుకునే దిగుమతుల్లో కొన్ని నమూనాలను సేకరించి, బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్ (బీఐఎస్) నాణ్యత ప్రమాణ పరిశోధనశాలలకు పంపుతుంది.
వారం రోజులపాటు వివిధ పరీక్షలు నిర్వహించి, అన్నింటా నాణ్యత సరిగ్గా ఉందనుకుంటేనే ఆయా దిగుమతులకు దేశంలోకి అనుమతి లభిస్తుంది. ఏ ఒక్క పరీక్ష విఫలమైనా వెనక్కి పంపించడమో లేక అక్కడికక్కడే నాశనం చేయడమో చేస్తారు.
చైనా భారత్‌కు అత్యుత్తమ ఎల్‌ఈడీ ఉత్పత్తుల్ని ఎగుమతి చేయని పక్షంలో భారీగా నష్టపోవాల్సి ఉంటుందని పరిశీలకులు వివరిస్తున్నారు. ఇప్పటికే భారత్ చైనా ఉత్పత్తుల నిషేధానికి, దేశంలోని ప్రాజెక్టులో జోక్యానికి చెక్ పెట్టేందుకు వివిధ చర్యలు తీసుకున్న సంగతి తెలిసిందే.
మరోవంక, చైనా నుంచి దిగుమతి అయ్యే వస్తువులను తగ్గించాలని భావిస్తున్న భారత్ ఇక మీదట అక్కడి నుంచి వచ్చే రసాయనాలను స్థానికంగానే తయారు చేయాలని యోచిస్తోంది. క్రిమిసంహారకాలు, ఫార్మా, పారిశ్రామిక రంగంలో ఉపయోగించే కీలక రసాయనాలను మన దేశంలోనే తయారు చేయించేందుకు సన్నాహాలు చేస్తోంది.
ఇందుకోసం కంపెనీలకు ప్రత్యేక ప్రోత్సాహకాలను అందించే (ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్(పీఎల్‌ఐ) పథకాన్ని రూపొందించాలని ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.
దీనిపై ఇటీవల సమావేశాలు నిర్వహించిన రసాయనాల శాఖ 75 కీలక రసాయనాలను గుర్తించిం ది. వీటిని స్థానికంగా తయారు చేసే జాబితాలో చేర్చే అవకాశం ఉంది. రసాయన ఉత్పత్తిలో 10ు ఖర్చును కంపెనీలకు ప్రోత్సాహకంగా ఇ వ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ పథకానికి వచ్చే ఐదేళ్లలో రూ 25 వేల కోట్లు వ్యయం చేస్తారు.
More Stories
సైబర్ నేరగాళ్ల చేతిలో 16.80 కోట్ల మంది పర్సనల్ డేటా
రాహుల్ కు రెండేళ్ల జైలు శిక్ష.. అనర్హత వేటు తప్పదా!
మరోసారి అత్యంత ధనవంతుడిగా అంబానీ