క‌ళ్యాణ్ సింగ్ ఆరోగ్య ప‌రిస్థితి  ఆందోళనకరం 

క‌ళ్యాణ్ సింగ్ ఆరోగ్య ప‌రిస్థితి  ఆందోళనకరం 

ఉత్త‌ర‌ప్ర‌దేశ్ మాజీ ముఖ్య‌మంత్రి క‌ళ్యాణ్ సింగ్ ఆరోగ్య ప‌రిస్థితిపై అనుమానాలు రేకెత్తుతున్నాయి. గ‌త సోమ‌వారం క‌రోనా బారిన‌ప‌డిన ఆయ‌న ల‌క్నోలోని సంజ‌య్ గాంధీ పీజీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడిక‌ల్ సైన్సెస్‌లో (ఎస్‌జీపీజీఐ) చికిత్స పొందుతున్నారు. ఆయన ఆరోగ్య ప‌రిస్థితి నిల‌క‌డ‌గానే ఉన్న‌ద‌ని ఎస్‌జీపీజీఐ డాక్ట‌ర్లు తెలిపారు. క‌రోనా నుంచి కోలుకుంటున్నార‌ని వెల్ల‌డించారు.

అయిన‌ప్ప‌టికీ నిన్న సాయంత్రం ప్ర‌భుత్వ హెలీకాప్ట‌ర్‌లో క‌ళ్యాణ్ సింగ్‌ను ఘ‌జియాబాద్‌లోని య‌శోధా ద‌వాఖాన‌కు త‌ర‌లించారు. కుటుంబ స‌భ్యుల కోరికమేర‌కే ఆయ‌న‌ను మ‌రో హాస్పిట‌ల్‌కు త‌ర‌లించిన‌ట్లు ఎస్‌జీపీజీఐ డాక్ట‌ర్లు వెల్ల‌డించారు. కోవిడ్ వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నామ‌ని య‌శోధా సూప‌రింటెండెంట్ అంజూ అగ‌ర్వాల్ తెలిపారు.

ఉత్త‌ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రిగా ప‌నిచేసిన క‌ళ్యాణ్ సింగ్‌, కేంద్రంలో ఎన్‌డీఏ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత రాజ‌స్థాన్ గ‌వ‌ర్న‌ర్‌గా నియ‌మితుల‌య్యారు. కాగా, బాబ్రీ మ‌సీదు కూల్చివేత‌లో నిందితునిగా ఉన్నారు.