జీఎస్‌టీ రాబడిలో లోటును అప్పుల ద్వారా రాష్ట్రాలు భర్తీ చేసుకోవాలన్న కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనకు 13 రాష్ట్రాలు ఆమోదం తెలిపాయి. ఆంధ్రప్రదేశ్, బీహార్, ఉత్తరప్రదేశ్, గుజరాత్, హరియాణా, కర్ణాటక, మధ్యప్రదేశ్, మేఘాలయ, సిక్కిం, త్రిపుర, ఉత్తరాఖండ్, ఒడిశా రాష్ట్రాలు తమ అంగీకారాన్ని తెలిపాయి.
తన ప్రతిపాదనలో భాగంగా కేంద్రం రాష్ట్రాలకు రెండు ప్రత్యామ్నాయాలను సూచించింది. రిజర్వు బ్యాంకు అందించిన స్పెషల్ విండో ద్వారా రూ. 97 వేల కోట్ల రుణం తీసుకోవాలని లేదా మార్కెట్ నుంచి రూ. 2.35 లక్షల కోట్ల అప్పును తీసుకోవాలని సూచించింది. అంతే కాకుండా ఈ రుణం చెల్లించేందుకు ప్రస్తుతం లగ్జరీ, డీమెరిట్ వస్తువులపై విధిస్తున్న కాంపన్సెషన్ సెస్సును 2022 సంవత్సరం తరువాత కూడా కొనసాగించే అవకాశం కూడా ఉందని సూచించింది.
12 రాష్ట్రాలు ఆర్‌బీఐ స్పెషల్ విండోను ఎంచుకోగా, మణిపూర్ మాత్రం రెండో ప్రత్యామ్నాయాన్ని ఎంచుకుంది. మరి కొన్ని రాష్ట్రాలను మాత్రం జీఎస్‌టీ కౌన్సిల్‌కు తమ సూచనలు పంపాయి. కేంద్ర సూచించిన మార్గాలపై ఇంకా ఓ నిర్ణయానికి రాలేదు.
మరోవైపు.. బీజేపేయేతర పార్టీల పాలనలో ఉన్న పశ్చిమ బెంగాల్, కేరళ, ఢిల్లీ, తెలంగాణ, చత్తీస్‌ఘడ్, తమిళనాడు మాత్రం జీఎస్‌టీ లోటు భర్తీ కోసం అప్పులు తెచ్చుకోవాలన్ని ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ కేంద్రానికి లేఖలు రాశాయి.
More Stories
ఆప్ ఎంపీ సంజీవ్ అరోరా ఇంట్లో ఈడీ సోదాలు
ఎస్బీఐలో కొత్తగా 10 వేల ఉద్యోగాలు
రూ.1,800 కోట్లకు పైగా విలువైన డ్రగ్స్ స్వాధీనం