తొమ్మిది మంది మావోయిస్టులు అరెస్టు

ఛ‌త్తీస్‌గ‌ఢ్‌లోని దంతేవాడ జిల్లాలో నేడు తొమ్మిది మంది మావోయిస్టుల‌ను భ‌ద్ర‌తా ద‌ళాలు అరెస్టు చేసిన‌ట్లు పోలీసు అధికారి ఒక‌రు తెలిపారు. 
 
స‌మాచారం మేర‌కు మెయిల్‌వాడా, మోఖ్‌పాల్ గ్రామాల మ‌ధ్య శ‌నివారం సాయంత్రం డిస్ర్టిక్ట్ రిజ‌ర్వ్ గార్డు(డీఆర్‌జీ), జిల్లా పోలీసులు సంయుక్తంగా గాలింపు చ‌ర్య‌లు చేప‌ట్టారు. సంఘ‌ట‌నా స్థ‌లంలో పెట్రోలింగ్ టీంల‌ను చూసి త‌ప్పించుకు పారిపోయేందుకు ప్ర‌య‌త్నించారు. అయినా కాసేపు ఛేజ్ అనంత‌రం మావోయిస్టులు ప‌ట్టుబ‌డ్డారు. 
 
ప‌ట్టుబ‌డ్డ మావోయిస్టుల‌ను నందా కవాసి (28), బడి వంజం (22), నందా పాడియామి (40), పజ్జా వంజం (23), సన్నా మాండవి (23), గుడి ముచాకి (21), హుంగా హేమ్లా (24), నాగ హేమ్లా (25), పాల రామ్ (24) గా గుర్తించారు. అంద‌రూ దిగువ స్థాయి కార్యకర్తలు. ఛ‌త్తీస్‌గ‌ఢ్ స్పెష‌ల్ ప‌బ్లిక్ సెక్యూరిటీ యాక్ట్, 2005 కింద వీరిపై కేసులు న‌మోదు చేసిన‌ట్లు దంతేవాడ ఎస్పీ అభిషేక్ ప‌ల్ల‌వ తెలిపారు.