ఐదుగురు లోక్‌స‌భ ఎంపీల‌కు క‌రోనా పాజిటివ్‌

పార్లమెంటు వర్షాకాల సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కాబోతుండగా ఐదుగ‌రు లోక్‌స‌భ ఎంపీల‌కు కోవిడ్‌-19 పాజిటివ్‌గా తేలింది. స‌భా స‌మావేశాల‌కు హాజ‌ర‌య్యేందుకు స‌భ్యులు త‌ప్ప‌నిస‌రిగా కోవిడ్ నెగెటివ్ రిపోర్టును స‌మ‌ర్పించాలి.
ఉభ‌య స‌భ‌ల స‌భ్యుల సౌక‌ర్యార్థం పార్ల‌మెంట్ ప్రాంగ‌ణంలో మూడు కోవిడ్ టెస్ట్ సెంట‌ర్ల‌ను ఏర్పాటు చేశారు. పార్లమెంటు సమావేశాలు ప్రారంభమయ్యేనాటికి 72 గంటల ముందు కోవిడ్-19 పరీక్షలు చేయించుకోవాలని ఉభయ సభల సభ్యులను కోరారు.
ప్రభుత్వ అనుమతి పొందిన ఏదైనా ఆసుపత్రి/ల్యాబొరేటరీలో పరీక్షలు చేయించుకోవాలని కోరారు. స‌భ్యులంతా దాదాపుగా ఇప్ప‌టికే ప‌రీక్ష‌లు చేయించుకున్నారు. ఫ‌లితాలు రావాల్సి ఉన్నాయి.

కోవిడ్-19 మహమ్మారి కారణంగా ఈ ఏడాది పార్లమెంటు సమావేశాల నిర్వహణలో చాలా మార్పులు చేశారు.పార్లమెంటు వర్షాకాల సమావేశాలకు ముందు అఖిల పక్ష సమావేశం నిర్వహించడం సంప్రదాయం. కానీ ఈ సంవత్సరం కోవిడ్ కారణంగా దీనిని రద్దు చేశారు.

నేరుగా బీఏసీ స‌మావేశం నిర్వ‌హించి స‌భ‌లో చ‌ర్చించాల్సిన అంశాల అజెండాను ఖ‌రారు చేశారు. క్వ‌శ్చ‌న్ అవ‌ర్‌ను తీసేశారు. జీరో అవ‌ర్‌ను త‌గ్గించేశారు. ప్ర‌తీ రోజు నాలుగు గంట‌ల‌పాటు మాత్ర‌మే స‌మావేశాలు జ‌ర‌గ‌నున్నాయి.