భారీగా తగ్గుతున్న పామాయిల్ దిగుమతులు

భారత్ లో కరోనా ప్రభావంతో పామాయిల్ దిగుమతులు గణనీయంగా తగ్గుతున్నాయి. ఆగస్టులో భారత్ లో పామాయిల్ దిగుమతులు 13.9శాతం  తగ్గి 7,34,351 టన్నులకు చేరుకున్నాయని ప్రముఖ వాణిజ్య సంస్థ తెలిపింది. హోటళ్ళు , రెస్టారెంట్ల నుంచి డిమాండ్ లేకపోవడం వల్ల ఈ పరిస్థితి నెలకొన్నది. 
 
భారత్ లో కరోనావైరస్ కేసులు రోజురోజుకూ పెరుగుతూనే ఉన్నాయి. దేశంలోని సోయా చమురు దిగుమతులు గత నెలలో 10.4% పడిపోయి 3,94,735 టన్నులకు చేరుకోగా, పొద్దుతిరుగుడునూనె దిగుమతులు 31% తగ్గి 1,58,518 టన్నులకు చేరుకున్నాయని సాల్వెంట్ ఎక్స్‌ట్రాక్టర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఎస్సీఏ) ఒక ప్రకటనలో తెలిపింది. 
 
పామాయిల్‌ను ప్రధానంగా హోటళ్ళు , రెస్టారెంట్లు వినియోగిస్తాయి. మార్చిలో దేశవ్యాప్తంగా కరోనావైరస్ లాక్‌డౌన్ విధించిన తరువాత క్రమంగా జూన్ నుంచి తిరిగి ప్రారంభమైంది. పామాయిల్ అమ్మకాలు జూలైలో వేగవంతం అయ్యాయి. 
 
అయితే ప్రపంచంలో రెండవ అత్యధిక జనాభా కలిగిన దేశంలో కరోనావైరస్ కేసులు పెరగడం వల్ల ఆగస్టులో డిమాండ్ బాగా తగ్గింది. భారతదేశం ఇండోనేషియా,మలేషియా నుంచి పామాయిల్ , సోయా ఆయిల్ తో పాటు పొద్దుతిరుగుడు నూనె వంటి ఇతర నూనెలను అర్జెంటీనా, బ్రెజిల్, ఉక్రెయిన్ , రష్యా నుంచి కొనుగోలు చేస్తుంది. 
 
పామాయిల్ , సోయా ఆయిల్ దిగుమతులు ఆగస్టులో భారతదేశం మొత్తం వంట నూనె దిగుమతులను సంవత్సరానికి 14% తగ్గించి 1.37 మిలియన్ టన్నులకు చేరుకున్నాయని సాల్వెంట్ ఎక్స్‌ట్రాక్టర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా తెలిపింది.
 
నవంబర్‌లో ప్రారంభమైన 2019-20 మార్కెటింగ్ సంవత్సరంలో మొదటి 10 నెలల్లో, భారతదేశ వంటనూనెల దిగుమతులు 13% తగ్గి 11.2 మిలియన్ టన్నులకు చేరుకున్నాయని సాల్వెంట్ ఎక్స్‌ట్రాక్టర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా తెలిపింది. 
 
భారతదేశం మొత్తం వంట నూనె దిగుమతులు ప్రస్తుత సంవత్సరంలో అక్టోబర్ 2020 వరకు 1.4-1.5 మిలియన్ టన్నుల మేర తగ్గొచ్చని పేర్కొన్నది. ఈ ఏడాదిలో 13.4-13.5 మిలియన్ టన్నులకు పడిపోవచ్చని ఎస్సీఏ అంచనా వేస్తున్నది. 
 
అంతకుముందు సంవత్సరం మొత్తం 14.9 మిలియన్ టన్నుల కొనుగోళ్లతో పోలిస్తే ఇది తగ్గిందని ఎస్సీఏ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ బి.వి. మెహతా చెప్పారు. పొరుగు దేశాలైన నేపాల్ , బంగ్లాదేశ్ నుంచి శుద్ధి చేసిన పామాయిల్ దిగుమతి చేసుకోవడానికి 39 లైసెన్సులను నిలిపివేసిందని ఆయన తెలిపారు.