భారతీయుల పరం కానున్న నిషేధిత చైనా యాప్ లు !

భారతీయుల పరం కానున్న నిషేధిత చైనా యాప్ లు !

ఇటీవల కేంద్ర ప్రభుత్వం మొత్తం 224 చైనీస్ గేమింగ్ యాప్‌‌లను ఇప్పుడు ఆయా కంపెనీల చైనా అధిపతులు తమ వ్యాపారాలను భారతీయ భాగస్వాములకు అమ్మేయాలని చూస్తున్నాయి. ప్రొడక్ట్‌‌ను రీలాంఛ్ చేసిన తర్వాత భారతీయ   కంపెనీలు వీటిని రన్ చేసేలా  చైనీస్‌‌ కంపెనీలు నిర్ణయించాయి. లైసెన్స్ ఫీజుల ద్వారా పేరెంట్ కంపెనీలు రెవెన్యూలను ఆర్జించాలని చూస్తున్నాయి. 

భారత ప్రభుత్వం నిషేధించిన  యాప్స్‌‌లో గేమింగ్, డేటింగ్ యాప్స్ ఎక్కువగా ఉన్నాయి. వాటిని  మళ్లీ ఆపరేట్ కావాలనుకుంటే భారతీయ భాగస్వాములకు వీటిని   అమ్మేయాలని తెలుస్తున్నది. దీంతో పేరెంట్ కంపెనీకి రాయల్టీ రూపంలో కాస్త పేమెంట్ వస్తుందని చెబుతున్నారు. 

భారత్రు చైనీస్ యాప్స్‌‌ లను నిషేధించిన తర్వాత చాలా గేమింగ్ యాప్స్‌‌ పెద్ద మొత్తంలో యూజర్లను కోల్పోయాయి. రెవెన్యూ, ఫండింగ్‌‌ లేకపోవడంతో చాలా చైనీస్ యాప్స్ భారత్ లో ఆపరేషన్స్‌‌ను మూసివేద్దామని అనుకుంటున్నాయి. కొన్ని ఇతర   కంపెనీలు ప్రభుత్వం నుంచి మరింత స్పష్టత కోరుతున్నాయి.  

కేంద్రప్రభుత్వం చైనీస్ కంపెనీల నిధుల సమీకరణ‌‌పైనా కూడా  కఠిన ఆంక్షలు విధించింది. దీంతో వారి భారతీయ కార్యాలయాలలో పనిచేసే ఉద్యోగులకు వేతనాలు చెల్లించేందుకు కూడా డబ్బులు లేవు. ఐదు వేల నుంచి 15 వేల మంది వరకు ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం ఉందని అంచనాలు ఉన్నాయి. 

జూన్‌‌లో తొలిసారి చైనీస్ యాప్స్‌‌పై నిషేధం విధించిన తర్వాత, చైనీస్ కంపెనీలకు పలు ప్రశ్నలను కేంద్రం సంధించింది.  భారత్ లో ఆపరేషన్స్‌‌ను మూసివేయడం, ఉద్యోగుల జాబ్స్ కోల్పోవడం వంటి విషయాలపై కంపెనీలు స్పందించాలని కేంద్రం ఆదేశించింది. 

అయితే కొన్ని కంపెనీల స్పందనలే రాగా, మిగిలిన కంపెనీలు ఇంకా స్పందించ వలసి ఉంది.  చాలా చైనీస్ యాప్స్‌‌కు భారత దేశం  అతిపెద్ద యూజర్ మార్కెట్‌‌. అందుకే ఇక్కడ తిరిగి వ్యాపారాన్ని నడిపించడానికి ఇవి అన్ని ప్రయత్నాలూ ప్రయత్నాలు చేస్తున్నాయి.