100 నగరాల్లో ఇంటివద్దకే  బ్యాంకింగ్ సేవలు  

ప్రభుత్వ రంగ బ్యాంకులు ఈజ్ బ్యాంకింగ్ సంస్కరణల ద్వారా  ఇంటి వద్దకే బ్యాంకింగ్ సేవలను ప్రవేశపెట్టాయి. దీనివల్ల వినియోగదారులు కాల్ సెంటర్లు, వెబ్ పోర్టల్స్ , మొబైల్ యాప్ ల ద్వారా ఇంటి వద్ద బ్యాంకు సేవలను పొందవచ్చు. 
 
అక్టోబర్1నుంచి ఈ సేవలు వినియోగదారులకు అందుబాటులోకి రానున్నాయి.ఈజ్ ఆఫ్ బ్యాంకింగ్ సంస్కరణలపై జరిగిన వర్చువల్ కార్యక్రమంలో ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ కొత్త డోర్ స్టెప్ బ్యాంకింగ్ సేవలను ప్రారంభించారు. 
 
కాల్ సెంటర్లు, వెబ్ పోర్టల్స్ , మొబైల్ యాప్స్ ద్వారా కూడా వినియోగదారులు తమ అభ్యర్థనలనుపంపడం ద్వారా ఈ సేవలు అందుకోవచ్చని ఆమె తెలిపారు.
 
డోర్ స్టెప్ బ్యాంకింగ్ సేవలను అందించేందుకు బ్యాంకుల తరపున బ్యాంకింగ్ ఏజెంట్లను నియమించనున్నారు. దేశంలోని 100 నగరాల్లో ఈ సేవలు ప్రారంభం కానున్నాయి. అయితే, ఈ సేవలను పొందడానికి వినియోగదారులు నామమాత్రపు చార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. 
 
ప్రస్తుతం ఇప్పుడు కూడా డోర్‌స్టెప్ బ్యాంకింగ్ (ఇంటి వద్దకే బ్యాంక్ సేవలు) అందుబాటులో ఉన్నాయి. అయితే ఇవి నాన్ ఫైనాన్షియల్ సర్వీసులు మాత్రమే. 
 
అందులో ముఖ్యమైనవి.. చెక్-డిమాండ్ డ్రాఫ్ట్ , పే-ఆర్డర్ సేకరణ, కొత్త చెక్‌బుక్ కోసం దరఖాస్తు స్లిప్, ఖాతా స్టేట్‌మెంట్ కోసం దరఖాస్తు, వ్యక్తిగతేతర చెక్‌బుక్ డెలివరీ, టర్మ్ డిపాజిట్ రశీదు డెలివరీ, టిడిఎస్-ఫారం -16 పంపిణీ మొదలైనవి ఉన్నాయి.