
బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ విషయంలో శివసేన వ్యవహరిస్తున్న తీరుపై మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి , బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ముంబైలోని కంగనా ఆఫీసు కూల్చివేతకు ఆదేశించిన ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే.. అదే బొంబాయిలోని అండర్‌వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం ఇంటిని మాత్రం ఎందుకు కూల్చలేదని ఫడ్నవీస్ ప్రశ్నించారు.
ప్రస్తుత పరిస్థుతుల్లో మీరు పోరాటం చేయాల్సింది కంగనతో కాదు కరోనాతో అంటూ హితవు పలికారు. కంగనాతో చేసే పోరాటంలో సగం శక్తిని కరోనా విలయం మీద వాడినా మంచి ఫలితం దక్కుతుందని ఎద్దేవా చేశారు.
మరోవంక, ఓ మహిళ పట్ల మీ భాగస్వామ్యంలోని ప్రభుత్వ తీరుపై మీరు స్పందిచకపోవడం విచారకరం.. మీ మౌనాన్ని చరిత్ర గమనిస్తోంది అంటూ ట్విట్టర్ వేదికగా కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ధోరణిపై కంగనా మండిపడ్డారు. మహారాష్ట్ర ప్రభుత్వం నన్ను వేధింపులకు గురి చేస్తోన్న విషయం చూసి ఓ మహిళగా మీకు కోపం రావడం లేదా అంటూ ఆమె ప్రశ్నించారు.
`ఈ రోజు మీ భాగస్వామ్యంలో ఏర్పడిన ప్రభుత్వం ఓ మహిళను వేధింపులకు గురి చేస్తూ.. శాంతి భద్రతలను పూర్తిగా అపహాస్యం చేస్తోంటో మీరు మౌనంగా.. ఉదాసీనంగా ఉన్నారు. చరిత్ర తప్పక మీ మౌనాన్ని నిర్ణయిస్తుంది. ఇప్పటికైన మీరు జోక్యం చేసుకుంటారని నేను ఆశిస్తున్నాను’ అంటూ కంగనా ట్వీట్ చేశారు.
More Stories
రాహుల్ కు రెండేళ్ల జైలు శిక్ష.. అనర్హత వేటు తప్పదా!
నకిలీ వార్తలు సమాజానికి ప్రమాదకరం
అట్టహాసంగా పద్మ అవార్డుల ప్రధానోత్సవం