వందో విజయం సాధించిన సెరెనా

అమెరికా టెన్నిస్‌‌ లెజెండ్‌‌  సెరెనా విలియమ్స్‌‌ మరో రికార్డు క్రియేట్‌‌ చేసింది. యూఎస్‌‌ ఓపెన్‌‌కు ఆతిథ్యం ఇచ్చే మెయిన్‌‌ స్టేడియం  ప్రతిష్టాత్మక ఆర్థర్​ యాష్​ స్టేడియంలో విక్టరీల సెంచరీ కొట్టింది. ఈ ఘనత సాధించిన తొలి ప్లేయర్​గా నిలిచిన సెరెనా మెగా టోర్నీలో క్వార్టర్​ఫైనల్‌‌కు దూసుకెళ్లింది. 

సోమవారం అర్ధరాత్రి జరిగిన మహిళల సింగిల్స్‌‌ ప్రి క్వార్టర్స్‌‌లో మూడో సీడ్‌‌ సెరెనా 6–3, 6–7 (6/8), 6–3తో 15వ సీడ్‌‌ మరియా సకారి (గ్రీస్‌‌)పై గెలిచింది. రెండు వారాల కింద వెస్టర్న్‌‌- సదరన్‌‌ ఓపెన్‌‌లో సకారి చేతిలో ఓటమికి బదులు తీర్చుకున్న అమెరికా లెజెండ్ ఈ స్టేడియంలో తన విక్టరీల రికార్డును 100–13కి పెంచుకుంది. 

సెరెనా తర్వాత ఈ ఇక్కడ మోస్ట్‌‌ విన్స్‌‌ రికార్డు స్విస్‌‌ లెజెండ్‌‌ రోజర్​ ఫెడరర్​ పేరిట ఉంది. అతను 77 మ్యాచ్​ల్లో గెలిచి 11 సార్లు ఓడిపోయాడు.  అన్‌‌సీడెడ్‌‌ పిరంకోవా 6–4, 6–7 (5/7), 6–3తో అలీజ్‌‌ కార్నెట్‌‌ (ఫ్రాన్స్‌‌)పై నెగ్గింది. సెకండ్‌‌ సీడ్‌‌ సోఫియా కెనిన్‌‌ (అమెరికా)కు ప్రిక్వార్టర్స్‌‌లోనే చుక్కెదురైంది. 16వ సీడ్‌‌ ఎలైస్‌‌ మెర్టెన్స్‌‌ (బెల్జియం) 6–3, 6–3తో కెనిన్‌‌కు షాచ్చింది. మ

కాగా, భారత్  డబుల్స్‌‌ స్టార్‌‌ రోహన్‌‌ బోపన్న–డెనిస్‌‌ షపవలోవ్‌‌ (కెనడా) జోడి యూఎస్‌‌ ఓపెన్‌‌ నుంచి నిష్క్రమించింది. మెన్స్‌‌ డబుల్స్‌‌ క్వార్టర్‌‌ఫైనల్లో బోపన్న–షపవలోవ్‌‌ 5–7, 5–7తో జులియన్‌‌ రోజెర్‌‌ (డచ్‌‌)–హరియా టెకాయ్‌‌ (రొమేనియా) చేతిలో ఓడారు. 26 నిమిషాల పాటు జరిగిన ఈ మ్యాచ్‌‌లో భారత్ –కెనడా ద్వయం సత్తా మేరకు రాణించలేదు. చెరోసారి సర్వీస్‌‌ కోల్పోయిన బోపన్న జంట ఒకే ఒక్క బ్రేక్‌‌ పాయింట్‌‌ను కాపాడుకోలేకపోయింది