ఈ హెల్ప్‌లైన్ ముఖ్యోద్దేశాలను సామాజిక న్యాయం, సాధికారతా శాఖ సంయుక్త కార్యదర్శి ప్రబోధ్ సేథ్ వివరిస్తూ బీఎస్ఎన్‌ఎల్ సాంకేతిక సమన్వయంతో రోజుకు 24 గంటలు, వారంలో ఏడు రోజులు (24X7) ఈ హెల్ప్‌లైన్ అందుబాటులో ఉంటుందని చెప్పారు.
660 క్లినికల్ అండ్ రిహాబిలేషన్ సైకాలజిస్టులు, 668 మంది సైకియాట్రిస్టులు సహాయకారిగా ఉంటారని తెలిపారు. హిందీ, అస్సామీ, తమిళం, మరాఠీ, ఒడియా, తెలుగు, మలయాళం, గుజరాతీ, పంజాబీ, కన్నడ, బెంగాలీ, ఉర్దూ, ఆంగ్లం వంటి 13 భాషల్లో ఈ సేవలు అందుబాటులో ఉంటాయని వివరించారు.
హైల్ప్‌లైన్ పనితీరును సేథ్ మరింత వివరిస్తూ, దేశంలోని ఏ నెట్‌వర్క్ నుంచైనా మొబైల్, ల్యాండ్‌లైన్ ద్వారా 1800-599-0019కు డయిల్ చేయాలని, తమకు నచ్చిన భాషను ఎంపిక చేసుకోవాలని చెప్పారు. ఆ వెనువెంటనే వారి స్వస్థలం లేదా కోరిన రాష్ట్రంలోని హెల్ప్‌లైన్ సెంటర్‌కు ఫోన్ కనెక్ట్ అవుతుందని తెలిపారు.
ఫోన్ కాలర్‌కు మెంటల్ హెల్త్ నిపుణులతో కనెక్ట్ కాగనే వారి సమస్యల పరిష్కారానికి ప్రయత్నించడంతో పాటు, అవసరమైన సైకాలజిస్టులు, సైకియాట్రిస్టులను రిఫర్ చేస్తారని చెప్పారు.
More Stories
6 కొత్త వందే భారత్ రైళ్లను ప్రారంభించిన ప్రధాని మోదీ
రెండు రోజుల్లో ముఖ్యమంత్రిగా కేజ్రీవాల్ రాజీనామా
ప్రధాన మంత్రి పదవి అంటే తిరస్కరించా!