సరిహద్దుల్లో భారత్-చైనా మధ్య కాల్పులు

సరిహద్దుల్లో భారత్-చైనా మధ్య కాల్పులు

తూర్పు లడఖ్ ఏరియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ వాస్తవాధీన రేఖ వెంబడి అర్ధరాత్రి కాల్పులు కలకలం సృష్టించాయి. ఐతే చైనా మాత్రం భారత సైనికులే హెచ్చరికగా కాల్పులు జరిపారని ఆరోపిస్తుంది. 

భారత సైనికులు ఎల్ ఏసీ దాటి ప్యాంగాంగ్ సరస్సు దక్షిణ ఒడ్డున ఉన్న షెన్ పావో పర్వత ప్రాంతంలోకి అక్రమంగా ప్రవేశించారని, పెట్రోలింగ్ నిర్వహిస్తున్న చైనీస్ గార్డులపై ఏకపక్షంగా కాల్పులు జరిపారని ఆరోపించింది.

మరోవైపు ఇవాళ ఇరు దేశాల విదేశాంగ మంత్రులు సమావేశం కానున్నారు. గత రెండు వారాల్లో చైనా బలగాలు రెండు సార్లు వాస్తవ సరిహద్దును మార్చేందుకు ప్రయత్నించాయి. ఐతే చైనా బలగాల ప్రయత్నాన్ని భారత సైనికులు తిప్పికొట్టారు.

మూడు నెలల క్రితం గల్వాన్ వ్యాలీలో భారత్-చైనా సైనికుల మధ్య ఘర్షణ చోటుచేసుకోవడంతో భారీగా ప్రాణ నష్టం జరిగిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.