జపాన్ ను భయపెడుతున్న హైషెన్ తుఫాన్

జపాన్ ను భయపెడుతున్న హైషెన్ తుఫాన్

This Saturday, Sept. 5, 2020, satellite image released by NASA Worldview, Earth Observing System Data and Information System (EOSDIS) shows Typhoon Haishen barreling toward the Okinawa islands in southern Japan on Saturday, prompting warnings about torrential rainfall and fierce wind gusts. Weather officials have cautioned about Typhoon Haishen for the last several days, urging people to brace for what could be a record storm and be ready to take shelter and stock up on food and water. (NASA via AP)

జపాన్ ను శక్తివంతమైన టైపూ న్ హైషెన్ తుఫాన్ వణికిస్తోంది. గంటకు 200 నుంచి 250 కిలోమీటర్ల వేగంతో వీస్తున్న పెనుగాలులు జపాన్ తీర ప్రాంతాలను అతలాకు తలం చేస్తున్నాయి. దీని ప్రభావంతో జపాన్ దక్షిణ ప్రాంతంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వారం రోజుల్లో జపాన్ పై విరుచుకుపడిన రెండో పెను తుఫాన్ ఇది

ప్రస్తుతం అమామీ ఒషిమా ఐలండ్​ దగ్గర కేంద్రీకృతమైన ఈ టైపూ న్ సోమవారం ఉదయం క్యూ షూ ఐలండ్​ దగ్గర తీరాన్ని తాకే అవకాశం ఉంది. రాగల 36 గంటల్లో ఉత్తర, దక్షిణ కొరియాల పైనా దీని ప్రభావం పడుతుందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ టైపూ న్ కారణంగా వంద నుంచి 200 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావచ్చని హెచ్చరించారు.

కగోషిమా నుంచి దాదాపు రెండున్నర లక్షల మందిని సురక్షిత ప్రాంతా లకు తరలించారు. నాగసాకిలోనూ 36 వేల మందిని షెల్టర్లకు తరలించారు. మరోవైపు కగోషిమా, ఒకినావాల్లో 2 లక్షల ఇండ్లకు పైగా పవర్ సప్లై నిలిచిపోయింది.కొన్ని వందల ఇండ్ల పైకప్పులు ఎగిరిపోగా.. వేలాదిఇండ్లకు కరెంట్ కట్ అయ్యింది. క్యూ షూ ఐలండ్​కు సమీపంలో ఉన్న ప్రధాన నదులన్నీ ప్రమాద స్థాయికి చేరుకున్నాయి.

ఈ టైపూ న్ పేరు హైషెన్. హైషెన్ అనేది చైనా పదం.దీనికి సముద్ర దేవుడని అర్థం . టైపూ న్ హైషెన్ కేటగిరి 3 హరికేన్. గత వారం జపాన్ తీరాన్ని తాకిన టైపూ న్ మేసాక్ కేటగిరి 4 హరికేన్.

టైపూ న్ ప్రభావిత ప్రాంతా ల్లో చేపట్టాల్సిన సహాయ చర్యలపై ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ సమీక్ష చేసినట్టు ఆ దేశ న్యూస్ ఏజెన్సీ వెల్లడించింది. హంగ్యాంగ్ ప్రావిన్స్​లో రిపెయిర్ వర్క్​ స్టార్ట్​ చేయాలని మిలిటరీని కిమ్ ఆదేశించారు. పౌరులు ముందుకొచ్చి డ్యామేజ్ అయిన ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టాలని పిలుపునిచ్చారు.