
ఆధునిక టెక్నాలజీతో పెట్రోల్ బంకుల్లో వాహనదారులను మోసం చేస్తున్న ముఠాను అరెస్టు చేసినట్లు సైబరాబాద్ సీపీ సజ్జనార్ వెల్లడించారు. పెట్రోల్ బంకుల్లోని పంపుల్లో ఇంటిగ్రేటెడ్ చిప్‌లు అమర్చి మోసం చేస్తున్నారు. లీటర్ పెట్రోల్ పోయించుకుంటే 970 మి.లీ. మాత్రమే వస్తోందని తెలిపారు.
వాహనదారుల ఫిర్యాదుతో తూనికల కొలతల శాఖ అధికారులతో కలిసి వరుసగా దాడులు చేశారు. వరుసగా దాడులు చేయడంతో మోసం వెలుగులోకి వచ్చింది. తెలంగాణలో 11, ఏపీలో 22 పెట్రోల్ బంక్‌లు సీజ్ చేశారు. ఏడాది నుంచి ఈ తరహా రూ. కోట్లలో మోసాలకు పాల్పడినట్లు సీపీ పేర్కొన్నారు.
తెలంగాణలో చిప్‌లు అమర్చిన నలుగురితో పాటు 9 పెట్రోల్ బంకుల యజమానులను అరెస్టు చేశారు. నిందితుల నుంచి 14 చిప్‌లు, 8 డిస్‌ప్లే బోర్డులు, మదర్ బోర్డుతో పాటు కారును స్వాధీనం చేసుకున్నారు. తెలంగాణలో 11 పెట్రోల్ బంకుల్లో 13 చిప్‌లు అమర్చినట్లు సజ్జనార్ పేర్కొన్నారు.
చిప్‌లు అమర్చడంతో సుభాని బాషా ప్రధాన నిందితుడు. ముంబైకి చెందిన వారితో కలిసి సాంకేతిక పరిజ్ఙానంతో చిప్‌లు తయారు చేశారు. పెట్రోల్ పోసే బాక్సుల్లో చిప్‌లు అమర్చి మోసం చేస్తున్నారు. డిస్‌ప్లేలో ఒక చిప్, లోపల మరో చిప్ అమర్చి మోసం చేస్తున్నట్లు సీపీ తెలిపారు. ఒక చిప్ అమర్చినందుకు రూ. 80 వేల నుంచి రూ. లక్షా 20 వేలరకు తీసుకుంటున్నారు.
అధికారులు వచ్చినప్పుడు విద్యుత్ సరఫరాను నిలిపేసేవారు. విద్యుత్ సరఫరా నిలిపివేయడం వల్ల ఒరిజినల్ సిస్టంకు వెళ్లిపోతోంది. ఈ విధంగా చిప్‌లు ఏర్పాటు చేసి అధికారులకు దొరక్కకుండా జాగ్రత్త పడేవారు. పెట్రోల్ బంకుల్లో రెండు పంపులు పెడుతారు.
క్యాన్స్, బాటిల్స్ లో పెట్రోలో పోసే సమయాల్లో ఒరిజినల్ పంపు నుంచి పోస్తారు. వాహనంలో పెట్రోల్ నింపే సమయంలో మోసాలకు పాల్పడుతున్నారు. నిందితుల మోసాలపై అన్ని కార్పొరేషన్లను అప్రమత్తం చేశామని సీపీ తెలిపారు. నిందితులపై పీడీ యాక్ట్ కూడా నమోదు చేస్తామని పేర్కొన్నారు.
ఈ ముఠా వెనుక ఎవరున్నారు అనే కోణంలో విచారణ జరుపుతున్నామని చెప్పారు. తెలంగాణ, ఏపీతో సహా ఇతర రాష్ట్రాల్లో కూడా మోసాలు చేసి ఉంటారని భావిస్తున్నామని సీపీ సజ్జనార్ వెల్లడించారు.
More Stories
సైబర్ నేరగాళ్ల చేతిలో 16.80 కోట్ల మంది పర్సనల్ డేటా
సుప్రీంకోర్టులో కవిత పిటిషన్ విచారణ 27న!
హైదరాబాద్ లో రెచ్చిపోతున్న వీధి కుక్కలు