మంత్రి హ‌రీశ్ రావుకు క‌రోనా పాజిటివ్‌

సోమవారం నుండి అసెంబ్లీ సమావేశాలు జరగనుండగా తెలంగాణ ఆర్థిక‌శాఖ మంత్రి హ‌రీశ్‌రావుకు కరోనా వైర‌స్ సంక్ర‌మించింది. ఆయ‌న ఈ విష‌యాన్ని త‌న ట్విట్ట‌ర్ అకౌంట్ ద్వారా వెల్ల‌డించారు.  క‌రోనా వైర‌స్ వ‌ల్ల క‌లిగే ల‌క్ష‌ణాలు ఉండడంతో.. ప‌రీక్ష చేయించుకున్నాన‌ని, ఆ ప‌రీక్ష‌లో పాజిటివ్ రిపోర్ట్ వ‌చ్చిన‌ట్లు మంత్రి హ‌రీశ్ త‌న ట్వీట్‌లో తెలిపారు.  
 
అయితే త‌న ఆరోగ్యం బాగానే ఉన్న‌ట్లు మంత్రి చెప్పారు.  గ‌త కొన్ని రోజుల నుంచి త‌న‌ను క‌లిసిన‌వారు క‌చ్చితంగా క‌రోనా ప‌రీక్ష చేయించ‌కోవాల‌ని మంత్రి త‌న ట్వీట్‌లో కోరారు.  త‌న‌తో కాంటాక్ట్ అయిన‌ ప్ర‌తి ఒక్క‌రూ ఐసోలేట్ కావాల‌ని, కోవిడ్ ప‌రీక్ష చేయించుకోవాల‌ని మంత్రి హ‌రీశ్ అభ్య‌ర్థించారు.    
 
హ‌రీష్‌రావుకు క‌రోనా సోక‌డంపై ఐటీ మంత్రి కేటీఆర్ ట్విట్ట‌ర్ వేదిక‌గా స్పందింస్తూ గెట్ వెల్ సూన్ బావ అంటూ  ట్వీట్ చేశారు. ఇత‌రుల కంటే మీరు త్వ‌ర‌గా కోలుకుంటార‌నే న‌మ్మ‌కం ఉంద‌ని కేటీఆర్ తెలిపారు. మొత్తానికి కొవిడ్ నుంచి హ‌రీష్‌రావు త్వ‌ర‌గా కోలుకోవాల‌ని మంత్రి కేటీఆర్ ఆకాంక్షించారు.