చైనాకు వ్యతిరేకంగా యావత్ ప్రపంచం 

చైనాకు వ్యతిరేకంగా యావత్ ప్రపంచం 

చైనా అన్యాయ విధానాలకు వ్యతిరేకంగా భారత్, ఆస్ట్రేలియా, జపాన్, దక్షిణకొరియా, వంటి దేశాలన్నీ ఏకం కావడం ప్రారంభించాయని, ప్రతి విషయం లోనూ బీజింగ్‌ను వెనక్కు నెట్టడానికి అమెరికాతో భాగస్వామ్యం పొందడానికి ప్రయత్నిస్తున్నాయని అమెరికా విదేశాంగ మంత్రి మైకె పొంపియో చెప్పారు. 

ఒక వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వూలో చైనా కమ్యూనిస్ట్ పార్టీ న్యాయంగా వ్యవహరించడానికి, పరస్పర సహకారానికి, పారదర్శకతకు విముఖత చూపిస్తోందని, అందుకే యావత్ ప్రపంచం చైనాకు వ్యతిరేకంగా ఏకమౌతోందని ఆయన వివరించారు. 

అందువల్ల భారత్‌లోని తమ మిత్రులుకానీ, ఆస్ట్రేలియాలోని మిత్రులు కానీ, జపాన్, దక్షిణ కొరియాలోని మిత్రులు కానీ వీరంతా త దేశ ప్రజలకు దేశాలకు ఎదురౌతున్న ముప్పును గమనిస్తున్నారని, ఈ నేపథ్యం లో అమెరికాతో కలసి చైనాను వెనక్కు నెట్టడానికి సిద్ధమౌతున్నాయని పేర్కొన్నారు.

దక్షిణ చైనా సముద్రం లోకి భారత్ యుద్ధ నౌకను పంపుతుండడంపై ప్రస్తవాసితు సరిహద్దుల్లో చైనాతో తలెత్తిన ఘర్షణ, దక్షిణ చైనా సముద్రంలో ఉన్న అమెరికా నావికా దళంతో ఉన్న అనుబంధం కారణంగా భారత్ చర్య ఉన్నట్టు కనిపిస్తోందని పేర్కొన్నారు. 

చైనా నుంచి ఎదురౌతున్న బెదిరింపులను ఎదుర్కొనడంలో భారత్‌తో అమెరికాకు ఉన్న స్నేహం ప్రాథాన్యం గురించి ప్రస్తావిస్తూ ఈ పోరులో తమకు స్నేహితులు, అనుబంధీకులు ఉన్నారని, రెండేళ్లుగా దీనికోసం తాము పనిచేస్తున్నామని, ఇప్పుడు అది నిర్మాణమౌతోందని పోంపియో వివరించారు. 

దాదాపు 1.3 మిలియన్ చదరపు మైళ్ల విస్తీర్ణంలో ఉన్న దక్షిణచైనా సముద్రం తమ సార్వభౌమత్వభాగంగా చైనా ప్రకటించింది. సైనికస్థావరాలను, కృత్రిమ దీవులను చైనా నిర్మిస్తోంది. బ్రునై, మలేసియా, ఫిలిప్పైన్స్, తైవాన్, వియత్నాం దేశాలు కూడా దక్షిణ చైనా సముద్రం తమదేనని వాదిస్తున్నాయి.

ఈ నేపథ్యంలో భారత్ మాత్రం దక్షిణ చైనా సముద్రం ప్రపంచ దేశాలలో భాగంగా స్పష్టం చేస్తోంది. ఈ అంతర్జాతీయ జల మార్గాల్లో స్వేచ్ఛగా నావికాయానం, విమానయానం ఉండాలని గట్టిగా చెబుతోంది. అమెరికా కూడా చైనా వాదనను వ్యతిరేకిస్తోంది. ప్రపంచాన్ని కొల్లగొడదామన్న చైనా దురాలోచనకు 21 వ శతాబ్దంలో తావు లేదని అమెరికా స్పష్టం చేసింది.