ఆంక్ష‌ల్ని ఎత్తివేసిన ఏపీ ప్ర‌భుత్వం

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం క‌రోనా ఆంక్ష‌ల్ని ఎత్తివేసింది. దేశంలో ఆన్ లాక్ నిబంధ‌న‌లు అమ‌ల్లోకి రావడంతో  రాష్ట్ర‌ప్ర‌భుత్వం ఆంక్ష‌ల్ని ఎత్తివేస్తూ ఉత్త‌ర్వులు జారీ చేసింది. 
 
ఇందులో భాగంగా గుంటూరు జిల్లా పొందుగుల చెక్ పోస్టు వద్ద ప్రయాణాలపై ఏపీ ప్రభుత్వం ఆంక్షలు ఎత్తివేసింది. ఇవాల్టి నుంచి అన్ లాక్ – 4 నిబంధనలు అమల్లోకి వచ్చిన దృష్ట్యా తెలంగాణ నుంచి ఏపీకి రోడ్డు మార్గం ద్వారా రాకపోకలు సాగించే ప్రయాణికుల పట్ల ఆంక్షలు పూర్తిగా ఎత్తివేసింది.
 
దీంతో తెలుగు రాష్ట్రాల మధ్య యథావిధిగా ప్రజల రాకపోకలు కొనసాగనున్నాయి. కాగా గతంలో ఇతర రాష్ట్రాల నుంచి ఏపీకి రావాలంటే ఈ-పాస్ తప్పనిసరిగా ఉండాల‌ని సూచింది. 
 
ఇలా ఉండగా, ఏపీలో కరోనా మరణ మృదంగం వాయిస్తోంది. ఇప్పటివరకూ 4 వేల 53 మందిని ఈ వైరస్ కబలించింది. తాజాగా కరోనా వైరస్ మరో 10,368 మందికి సోకింది. గడిచిన 24 గంటల్లో కరోనాతో 84 మంది చనిపోగా 9 వేల 350 మంది రికవరీ అయ్యారు. ఇప్పటివరకూ మొత్తం 4 లక్షల 45 వేల 139 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది.