దేశవ్యాప్తంగా సెప్టెంబర్ 7 నుంచి దశలవారీగా మెట్రోరైల్ సేవలు పునఃప్రారంభించడానికి కేంద్ర ప్రభుత్వం అనుమతినిచ్చింది. నాన్ కంటైన్మెంట్ జోన్లలో ఆంక్షలను రద్దు చేసింది. అలాగే సెప్టెంబర్ 30 వరకు విద్యాసంస్థలు, పాఠశాలలు. స్విమ్మింగ్ పూల్స్ బంద్ కొనసాగుతుందని చెప్పింది.
సెప్టెంబర్ 21 నుంచి ఓపెన్ ఎయిర్ థియేటర్లకు అనుమతిచ్చింది. అంతరాష్ట్ర ప్రయాణాలకు నిబంధనలను తొలగించింది.9 నుంచి 12 తరగతుల విద్యార్థులు తమ పాఠశాలలను (కంటైన్మెంట్ జోన్ల వెలుపల ఉంటేనే) స్వచ్ఛంద ప్రాతిపదికన ఉపాధ్యాయుల నుంచి గైడెన్స్ తీసుకోవాడనికి అనుమతి ఉంటుంది. ఐతే విద్యార్థులు వారి తల్లిదండ్రులు/సంరక్షకుల నుంచి రాతపూర్వక అనుమతి తప్పనిసరి చేసింది.
సెప్టెంబర్ 21 నుంచి సామాజిక / విద్యా / క్రీడలు / వినోదం / సాంస్కృతిక / మత / రాజకీయ తదితర కార్యక్రమాలను 100 మంది మించకుండా నిర్వహించుకోవచ్చు. కంటైన్మెంట్ జోన్లలో సెప్టెంబర్ 30 వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయని స్పష్టం చేసింది.
అన్‌లాక్ 4.0 గైడ్‌లైన్స్ ….
- సెప్టెంబర్ 7 నుంచి మెట్రోరైళ్లకు అనుమతి
- సెప్టెంబర్ 30 వరకు స్కూళ్లు, మాల్స్ బంద్
- సినిమా థియేటర్లు, స్విమ్మింగ్ పూల్స్ బంద్
- 100 మందికి మించకుండా స్పోర్ట్స్, ఎంటర్‌టైన్‌మెంట్, రాజకీయ సమావేశాలకు అనుమతి
- సభలు నిర్వహించే సమయంలో భౌతికదూరం, మాస్క్, శానిటైజర్ తప్పనిసరి
- సెప్టెంబర్ 21 నుంచి ఓపెన్ ఎయిర్ థియేటర్లకు అనుమతి
- అంతరాష్ట్ర ప్రయాణాలకు నిబంధనలను తొలగింపు
- అంతర్జాతీయ ప్రయాణాలపై నిషేధం కొనసాగింపు
- చిన్నారులు, గర్భిణీలు, వృద్ధులు ఇళ్లకే పరిమితం కావాలన్న కేంద్రం
- అత్యవసరమైతేనే బయటకు రావాలి
- సెప్టెంబర్ 30 వరకు కంటైన్మెంట్ జోన్లలో ఆంక్షలు కొనసాగింపు
More Stories
6 కొత్త వందే భారత్ రైళ్లను ప్రారంభించిన ప్రధాని మోదీ
రెండు రోజుల్లో ముఖ్యమంత్రిగా కేజ్రీవాల్ రాజీనామా
ప్రధాన మంత్రి పదవి అంటే తిరస్కరించా!