నీట్-యూజీ 2026 పేపర్ లీక్ నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ కాక్రోచ్ జనతా పార్టీ ( సీజేపీ ) నేతృత్వంలో జరిగిన నిరసనల్లో పాల్గొన్న విద్యార్థులపై ఎలాంటి బలవంతపు చర్యలు తీసుకోకూడదని సుప్రీంకోర్టు మంగళవారం రాష్ట్రాలను ఆదేశించింది. పోలీసులు ఎఫ్ఐఆర్ లు నమోదు చేయవచ్చని, కానీ ప్రస్తుతానికి ఎలాంటి బలవంతపు చర్యలు తీసుకోకూడదని కోర్టు స్పష్టం చేసింది.
అంతేకాదు, నిరసనల సందర్భంగా అరెస్టు లేదా అదుపులోకి తీసుకున్న 18 ఏళ్లలోపు విద్యార్థులను, వారికి ఎలాంటి నేరచరిత్ర లేకపోతే వెంటనే విడుదల చేయాలని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. అయితే కేసుల దర్యాప్తు మాత్రం చట్టప్రకారం కొనసాగించవచ్చని స్పష్టం చేసింది. అయితే, నేర చరిత్ర ఉన్న వ్యక్తులను కోర్టు మినహాయించింది. వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవచ్చనేది మాత్రం స్పష్టం చేయలేదు.
నిరసనల సందర్భంగా అరెస్టు లేదా అదుపులోకి తీసుకున్న 18 ఏళ్లలోపు విద్యార్థులను, వారికి ఎలాంటి నేర చరిత్ర లేకపోతే వెంటనే విడుదల చేయాలని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. అయితే కేసుల దర్యాప్తు మాత్రం చట్టప్రకారం కొనసాగించవచ్చని స్పష్టం చేసింది. నిరసనకారులపై పోలీసులు తీసుకున్న చర్యల గురించి తమ వివరణ ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వంతో పాటు ఢిల్లీ పోలీసులకు సుప్రీంకోర్టు అవకాశం కల్పించింది. వాళ్లు తమ వాదనలు వినిపించవచ్చు అని చెప్పింది.
విద్యార్థుల ఆందోళనల సందర్భంగా పోలీసులు చర్యలపై సిట్ ఏర్పాటుకు ఆదేశించాలని దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జాయ్ మాల్యబాగ్చి, వి.మోహనతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. నిరసనల సమయంలో 250మంది పోలీసులపై దాడికి పాల్పడింది విద్యార్థులా లేక ఆందోళనల్లోకి చొరబడిన క్రిమినల్సా అనే కోణంలో దర్యాప్తు జరగాలని సూచించింది.
ఈ అంశాలపై స్వతంత్ర, పారదర్శక దర్యాప్తునకు కమిటీ ఏర్పాటు చేస్తామని న్యాయస్థానం వెల్లడించింది. పోలీసులపై విద్యార్థులు దాడులు చేయలేదని, నిరసనల ముసుగులో నేరస్థులు ప్రవేశించి హింసకు పాల్పడ్డారని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా తెలిపారు. శాంతియుతంగా నిరసన తెలిపే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంటుందని, ఆందోళనల పేరుతో జరిగే హింసను లేదా పోలీసుల లాఠీఛార్జ్‌ను సమర్థించలేమని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది.
నిరసనకారుల పర్సనల్ డేటా కానీ, వివరాలను కానీ పబ్లిష్ చేయవద్దు అని కోర్టు ఆదేశించింది. పెల్లెట్ గన్స్ వాడిన అంశంపై కూడా కోర్టు వాదనలు విన్నది. విద్యార్థులకు, పోలీసులకు జరిగిన గాయాల పట్ల నిష్పాక్షిక దర్యాప్తు చేపట్టాలని కోర్టు పేర్కొన్నది. దీని కోసం మాజీ జడ్జీ నేతృత్వంలో సిట్‌ను ఏర్పాటు చేయాలని సుప్రీం తన ఆదేశాల్లో స్పష్టం చేసింది.
More Stories
పాక్ బలగాల అమానుష చర్యలో పీఓకేలో 20 మంది మృతి
2 నెలల్లోనే పేపర్ లీకేజీ కేసుల దర్యాప్తు పూర్తి
సుప్రీంకోర్టును ఆశ్రయించిన గాయాలకు గురైన పోలీసు కుటుంబాలు!