గౌహతి వేదికగా జరిగిన రెండో వన్డేలో భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్ అద్భుత డబుల్ సెంచరీతో విధ్వంసం సృష్టించాడు. దీంతో 406 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా చేధించి రికార్డు విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ 7 వికెట్లు కోల్పోయి 405 పరుగులు చేసింది. అనంతరం భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి మరో 40 బంతులు మిగిలుండగానే సూపర్ విక్టరీ సాధించింది.
ఈ విజయంతో మరో మ్యాచ్ మిగిలుండగానే సిరీస్‌ను భారత్ 2-0తో దక్కించుకుంది. గిల్‌కే ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు లభించింది. మూడో, చివరి వన్డే శనివారం చండీగఢ్‌లో జరుగుతుంది. హిట్‌మ్యాన్ మొదట్నుంచే దంచుడు మంత్రాన్ని జపిస్తే క్రీజులో కుదురుకున్నాక గిల్ అదే రూట్లోకి రావడంతో పది ఓవర్లకే భారత్ వికెట్లేమీ నష్టపోకుండా 92 రన్స్‌తో బలమైన పునాదిని వేసుకుంది.
ఈ సిరీస్‌లో గిల్ కు ఇది వరుసగా రెండో సెంచరీ. 84 పరుగుల వద్ద తాను ఇచ్చిన క్యాచ్‌ను కార్టీ జారవిడవడంతో బతికిపోయిన రోహిత్ విటెల్ లావెస్ బౌలింగ్‌లో ఆఫ్‌సైడ్ సింగిల్‌తో 83 బంతుల్లో సెంచరీ పూర్తయింది. కానీ ఆ వెంటనే సీల్స్ ఓవర్లో అతడు వికెట్ల ముందు దొరికిపోవడంతో 255 పరుగుల రికార్డు తొలి వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది.
రోహిత్ పెవిలియన్ చేరినా కోహ్లీ (29) అండతో కెప్టెన్ ధనాధన్ ఇన్నింగ్స్ ఆడి ద్విశతకం దిశగా సాగాడు. గిల్ జోరుతో 29.1 ఓవర్లకే భారత్ 300 రన్స్ చేరుకుంది. రూథర్‌ఫర్డ్ సూపర్ క్యాచ్‌తో కోహ్లీ ఔటైనా రుతురాజ్ (31 నాటౌట్) సహాయంతో గిల్ ద్విశతకాన్ని సాధించాడు. 117 బంతుల్లోనే అతడి డబుల్ సెంచరీ పూర్తవడం విశేషం.
వన్డేల్లో వేగంగా డబుల్ సెంచరీ (117 బంతుల్లో) సాధించిన ప్లేయర్ గిల్ . ఇషాన్ 2022లో బంగ్లాదేశ్‌పై 126 బంతుల్లో చేసిన రికార్డును బ్రేక్ చేశాడు.వన్డేల్లో రెండు డబుల్ సెంచరీలు చేసిన రెండో ఆటగాడు గిల్. రోహిత్ మూడు ద్విశతకాలతో అగ్రస్థానంలో ఉన్నాడు.వన్డేల్లో భారత్‌కు ఇదే అత్యుత్తమ ఛేదన. 2013లో ఆస్ట్రేలియాపై 362 పరుగులను ఛేజ్ చేయడమే ఇప్పటిదాకా బెస్ట్.వన్డేల్లో రోహిత్‌కు ఇది 35వ శతకం. ఈ ఫార్మాట్లో 12 వేల రన్స్ కూడా పూర్తి చేశాడు.
More Stories
దేశవ్యాప్త జాతీయ పౌర రిజిస్టర్ కోసం ఆర్ఎస్ఎస్ పిలుపు
కీలక అంశాలపై ట్రంప్- మోదీ ఫోన్ సంభాషణ
2029 చివరకు మాదకద్రవ్య రహిత రాష్ట్రంగా పంజాబ్