
తెలంగాణ హైకోర్టులో జడ్జిల సంఖ్య 42 కు పెంచాలని కోరుతూకేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ ను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి కోరారు. రాష్ట్ర విభజన సమయంలో తెలంగాణ హైకోర్టులో 24 మంది జడ్జీల నియామకానికి అనుమతించారని లేఖలో పేర్కొన్నారు. కానీ ప్రస్తుతం హైకోర్టులో 14 మంది జడ్జీలు మాత్రమే ఉన్నారని కిషన్ రెడ్డి కేంద్రమంత్రికి తెలిపారు.
అనుమతించిన సంఖ్యలో కూడా న్యాయమూర్తులు లేక పోవడంతో పెండింగ్ లో ఉన్న కేసుల సంఖ్య పెరగడంతో పాటు కొత్తగా వస్తున్న కేసులను పరిష్కరించడం కష్టంగా ఉన్నట్లు పేర్కొన్నారు. మొత్తం 24 మంది న్యాయమూర్తులను నియమించినా పెండింగ్ లో ఉన్న కేసుల పరిష్కారం సాధ్యం కాదని తెలిపారు.
రాష్త్ర హై కోర్ట్ లో 46 నుండి 48 న్యాయమూర్తుల వరకు అనడానికి అవసరమైన మౌలిక సదుపాయాలు ఉన్నట్లు కిషన్ రెడ్డి కేంద్ర మంత్రి దృష్టికి తీసుకు వచ్చారు. కోర్టుల్లో పెండింగ్ కేసుల సంఖ్య రోజురోజుకు విపరీతంగా పెరుగుతోందని, ప్రజలకు సత్వర న్యాయం జరగాలంటే జడ్జిల సంఖ్యను పెంచాలని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు.
కేంద్ర మంత్రిని కలిసిన వారిలో కిషన్ రెడ్డితో పాటు తెలంగాణ బార్ కౌన్సిల్ చైర్మన్ నరసింహారెడ్డి బిజెపి శాసన మండలి పక్ష నాయకుడు ఎన్ రామచందర్ రావు కూడా ఉన్నారు.
More Stories
ఉగ్రదాడి సాకుతో జమ్ముకశ్మీర్‌కు రాష్ట్ర హోదా అడగను
గాయని నేహా రాథోడ్‌పై దేశద్రోహం కేసు
పాతబస్తీలో భూదాన్ భూముల వ్యవహారంలో ఈడీ సోదాలు