ద్విచక్ర వాహనాలపై వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం టూవీలర్లపై అత్యధికంగా 28 శాతం పన్ను పడుతున్నది. ఈ క్రమంలో లగ్జరీ ఉత్పత్తులు లేదా హానికరమైన వస్తువు కాని టూవీలర్లపై ఇంత పన్ను పడటం సబబు కాదని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ వ్యాఖ్యానించారు.
వ్యాపార, పారిశ్రామిక సంఘం సీఐఐతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగిన సమావేశంలో టూవీలర్లపై జీఎస్టీ భారాన్ని తగ్గించాలన్న పరిశ్రమ అభ్యర్థనకు మంత్రి సానుకూలంగా స్పందించారు. గురువారం జీఎస్టీ 41వ సమావేశం జరుగనుండగా, వచ్చే నెల 19న 42వ సమావేశం జరుగనున్నది.
మరోవైపు రూ.3 లక్షల కోట్ల రుణ హామీ పథకంలో మార్పులు చేసి చిన్న వ్యాపారులకు మరింత ఆర్థిక సహకారాన్ని అందిస్తామని నిర్మలా సీతారామన్ ఈ సందర్భంగా అన్నట్లు సీఐఐ తెలిపింది. ఆత్మనిర్భర్ భారత్ అభియాన్‌లో భాగంగా ఈ పధకాన్ని ప్రకటించారు.
More Stories
పిల్లల భవిష్యత్తు కు భరోసాగా “ఎన్పీఎస్ వాత్సల్య” నేడే ప్రారంభం
పునరుత్పాదక ఇంధన రంగంలో రూ. 32.5 లక్షల కోట్లు
సవాళ్ల సుడిగుండంలో ప్రపంచ ఆర్థికాభివృద్ధి