నీరవ్ భార్య అమీపై ఇంటర్ పోల్ నోటీసు 

పంజాబ్ నేషనల్ బ్యాంకుకు వేల కోట్ల రూపాయలు ఎగనామం పెట్టి విదేశాలకు పారిపోయిన నీరవ్ మోదీ ప్రస్తుతం యుకె జైల్లో శిక్ష అనుభవిస్తున్నాడు. 
 
అయితే, ఇంటర్ పోల్ రెడ్ కార్నర్ నీరవ్ మోదీ భార్య అమీ మోదీపై మంగళవారం నోటీసులు జారీ చేసింది. నీరవ్ మోదీపైనా, ఆయన భార్య అమీపైనా భారత్ లో మనీలాండరింగ్ కు పాల్పడినట్లు ఇడి కేసులు నమోదు చేసింది. 
 
 భార‌త్‌లో న‌మోదు అయిన మ‌నీ ల్యాండ‌రింగ్ కేసులో ఆమెకు నోటీసులు జారీ అయ్యాయి. రెడ్ కార్న‌ర్ నోటీసులు ఉంటే.. నిందితుడు ఏ దేశంలో ఉన్నా వారిని అరెస్టు చేసి స్వ‌దేశానికి అప్ప‌గిస్తారు. ఇదే కేసులో ఇప్ప‌టికే నీర‌వ్ మోదీ, సోద‌రుడు నేహ‌ల్ మోదీతో పాటు సోద‌రి పూర్వికి కూడా రెడ్‌కార్న‌ర్ నోటీసులు జారీ చేశారు.
 
వారిపై సిబిఐ కేసులు ఉన్న సంగతి తెలిసిందే. ఇడి, సిబిఐ కేసులున్న నేపథ్యంలో అమీపై రెడ్ కార్నర్ నోటీసులు జారీ అయ్యాయి. ఇక ఆమె ఏ దేశంలో ఉన్నా అరెస్ట్ చేయవచ్చని అధికారులు తెలిపారు.
 
గ‌త ఏడాది లండ‌న్‌లో నీర‌వ్ మోదీని అరెస్టు చేశారు. ఆయ‌న ప్ర‌స్తుతం వాండ్స్‌వ‌ర్త్ జైలులో ఉన్నాడు. పంజాబ్ నేష‌న‌ల్ బ్యాంకుకు వేల కోట్ల రుణం ఎగ‌వేసిన కేసులో నీర‌వ్ మోదీ ప్ర‌ధాన నిందితుడిగా ఉన్నాడు. నీర‌వ్ మోదీ, మేహుల్ చోక్సీలు ఇద్ద‌రూక‌లిస 14వేల కోట్ల స్కామ్‌కు పాల్ప‌డిన‌ట్లు సీబీఐ త‌న చార్జ్‌షీట్‌లో దాఖ‌లు చేసింది. 2018లో ఇద్ద‌రూ దేశం విడిచి వెళ్లారు.