శిరోముండనం కేసులో ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి సమీప బంధువు ఉన్నాడని, అతనెవరో తనకు తెలుసునని నరసాపురం ఎంపి రఘురామకృష్ణంరాజు సంచలన ఆరోపణ చేశారు. శిరోముండనం ఘటనపై మొదటిసారిగా జగన్ స్పందించడాన్ని ప్రస్తావిస్తూ ఈ వాఖ్య చేశారు.
”శిరోముండనం కేసుపై సిఎం జగన్ లేటుగానైనా లేటెస్టుగా స్పందించినందుకు ధన్యవాదాలు. ఈ కేసులో సిఎం సమీప బంధువు ఉన్నారు. ఆయన ఇన్‌స్పెక్టర్‌తో మాట్లాడారు. శిరోముండనం చేయించమని చెప్పకపోయినా తీవ్రంగా దండించమని చెప్పినట్టున్నారు” అంటూ పేర్కొన్నారు.
బంధుప్రీతికి, ఆశ్రితపక్షపాతానికి అతీతంగా ఉంటానని జగన్ చెప్పడంతో ఈ విషయాన్నీ తాను వెల్లడిచేస్తున్నట్లు తెలిపారు. “ఆ వ్యక్తి ఎవరో నాకు తెలుసు. మీరు నిజనిర్ధారణ చేయండి. మీకు తెలుస్తుంది. మీకు మంచి పేరు వస్తుంది” అంటూ జగన్ కు హితవు చెప్పారు.
పోలీసులే ఇలా శిరోముండనం చేయించడం సరికాదని అంటూ సోషల్ మీడియాలో కారు కూతలు కూయిస్తూ.. చెడు రాతలు రాయించడం సరైంది కాదని ఆక్షేపణ వ్యక్తం చేశారు.
More Stories
నేడే శ్రీవారి బ్రహ్మోత్సవ అంకురార్పణం
పవన్ కల్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష విరమణ
అమరావతికి ప్రపంచ బ్యాంకు తొలివిడతలో రూ.3750 కోట్లు