మొట్ట మొదటి సారిగా కాంగ్రెస్ లో రాహుల్ గాంధీ నాయకత్వంపై ధిక్కార ధోరణులు బహిరంగంగా వ్యక్తమయ్యాయి. పార్టీలో నాయకత్వ సంక్షోభంపై 23 మంది సీనియర్ నాయకులు లేఖ వ్రాసిన నేపథ్యంలో సోమవారం జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో పార్టీలో రాహుల్ నాయకత్వం పట్ల వ్యతిరేక ధోరణులు బర్గతమయ్యాయి.
ఈ లేఖ పట్ల రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, ఇతర నేహతలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ బీజేపీతో కుమ్మక్కై లేఖ రాసినట్లుగా భావించాల్సి వస్తుందని అంటూ రాహుల్ పేర్కొనడం పార్టీలో పెద్ద దుమారానికి దారితీసింది. 30 ఏళ్లుగా కాంగ్రెస్ కు అంకిత భావంతో పనిచేస్తున్న తనను ఆ పార్టీతో కుమ్మక్కయ్యారని రాహుల్ అంటారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ కపిల్ సిబాల్ ట్వీట్ చేశారు.
మరోవంక రాజ్యసభలో ప్రతిపక్ష నేత గులాబీ నబి ఆజాద్ తాను బీజేపీతో కుమ్మక్కైన్నట్లు నిరూపిస్తే తన పదవులకు రాజీనామా చేస్తానని స్పష్టం చేశారు. దానితో వెనుకకు తగ్గిన రాహుల్ నష్ట నివారణ చర్యకు పాల్పడ్డారు. ఆ విధంగా అనలేదని అనడం ద్వారా వారిద్దరితో తమ వాఖ్యాలను వెనుకకు తీసుకొంటూ ప్రకటనలు ఇప్పించారు.
వర్చువల్ విధానంలో సమావేశం జరుగుతుండగా సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్, సీనియర్ నేతలు ఏకే ఆంటోని, ఆజాద్, చిదంబరం, వీరప్ప మొయిలీతో పాటు సీనియర్ పాటు 48 మంది సభ్యులు పాల్గొన్నారు.
టెన్ జన్‌పథ్ నుంచి కాంగ్రెస్ సీనియర్ నేత కేసీ వేణుగోపాల్ పాల్గొంటూ మొదట వేణుగోపాల్ సోనియా గాంధీ రాసిన లేఖను సభ్యులకు చదివి వినిపించారు.
అయితే పార్టీలో వ్యవస్థాగత సంస్కరణలు కోరుతూ 23 మంది నేతలు వ్రాసిన లేఖలోని అంశాల గురించి చర్చించడం గాని, లేదా ఆయా అంశాలను తిరస్కరించడం గాని జరిగిన్నట్లు లేదు. కేవలం గాంధీ కుటుంభం పట్ల తమ విశ్వాసాన్ని వ్యక్తం పరచడం పట్లనే పలువురు నేతలు ఆసక్తి చూపారు.
ఈ సందర్భంగా సోనియా తనకు అధ్యక్ష పదవిపై ఆసక్తి లేదని, కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవాలని సూచించారు. అనంతరం సమావేశం ప్రారంభం కాగానే.. కేసీ వేణుగోపాల్ ఇటీవల పార్టీ నేతలు సోనియాకు రాసిన లేఖ బహిర్గతం కావడంపై ప్రశ్నించారు. లేఖ బయటకు ఎలా వెళ్లిందని ప్రశ్నించారు.
మొదటగా రాహుల్ మాట్లాడుతూ సోనియా ఆరోగ్యం సరిగా లేని సమయంలో లేఖ రాసేందుకు సమయం ఇదేనా అని ప్రశ్నించినట్లు తెలిసింది. పార్టీ అంతర్గత వ్యవహారాలు ఎలా బయటకు వెళ్తున్నాయని ప్రశ్నించారు. పార్టీ విషయాలను అంతర్గత వ్యవహారాలను సోషల్ మీడియాలో, బహిరంగంగా ఎందుకు చర్చిస్తున్నారని ప్రశ్నించినట్లుగా తెలిసింది.
కాంగ్రెస్ పార్టీ బలహీనంగా ఉన్న సమయంలో, మధ్యప్రదేశ్-రాజస్థాన్ రాష్ట్రాల్లో సంక్షోభం ఉన్న సమయంలో, సోనియా గాంధీ ఆరోగ్యం సరిగా లేని సమయంలో ఎందుకు సీనియర్లు ధిక్కార స్వరాన్ని వినిపిస్తున్నారని రాహుల్ ప్రశ్నించారు. సమయంలో పార్టీ నాయకత్వ బాధ్యతలపై చర్చ అవసరమా? అన్నట్లు తెలుస్తోంది. నాయకత్వం మార్పు సమయం చూసుకోకుండా లేఖ రాయడంపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.
More Stories
సామరస్యంతోఅస్పృస్యతను పూర్తిగా నిర్ములించాలి
డొనాల్డ్ ట్రంప్ సమీపంలో కాల్పులు.. మరోసారి హత్యాయత్నం?
సినీ నటి జేత్వాని వేధింపుల కేసులో ముగ్గురు ఐపీఎస్‌లపై వేటు