తెలంగాణలో కొత్తగా శుక్రవారం 2474 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా కేసులు 1,01,865 కు చేరింది. మరో 7 మంది చనిపోయారు. దీంతో కరోనా మృతుల సంఖ్య 744కు చేరింది.
నిన్న ఒక్కరోజే 1768 మంది డిశ్చార్జ్ అయ్యారు. వీరితో కలిపి రాష్ట్రంలో ఇప్పటి వరకు కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 78,735 చేరింది. ఇంకా 22,386 మంది ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు.
ఇక నిన్న ఒక్కరోజే రాష్ట్రంలో43095 టెస్టులు చేశారు. దీంతో మొత్తం టెస్టుల సంఖ్య 8,91,73కి చేరింది. రాష్ట్రంలో కరోనా రికవరీ రేటు 77.29 గా ఉంది. నిన్న నమోదైన అత్యధిక కేసుల్లో జీహెచ్ఎంసీలో 447,రంగారెడ్డి 201, నిజామాబాద్ 153, మేడ్చల్ మల్కాజ్ గిరి 149, ఖమ్మం 125, వరంగల్ అర్బన్ 123, నల్గొండ జిల్లాలో 122 నమోదయ్యాయి.
More Stories
నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో హిందూ ఆధ్యాత్మిక, సేవా మేళా
మయోనైజ్పై తెలంగాణాలో నిషేధం
స్థానిక బిసి రిజర్వేషన్లపై ప్రత్యేక కమిషన్