
కోవిడ్ నిబంధనల పేరుతో వినాయక విగ్రహాలు ప్రతిష్ఠించకుండా పోలీసులు అడ్డుంకులు సృష్టిస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. ఫంకరోమాంగర్ మహాశక్తి ఆలయంలో జరిగిన వినాయక చవితి పూజల్లో ఆయన పాల్గొన్నారు.
కరోనా నిబంధనల పేరుతో భక్తులను ఇబ్బందులకు గురిచేస్తున్నట్లు తెలుసుకున్న ఆయన అసహనం వ్యక్తం చేశారు. పూజల్గొ పాల్గొని వెళ్లిపోయారు. దేశమంతా గణేశ్ నవరాత్రోత్సవాలు సంతోషంగా నిర్వహించుకుంటుంటే ఈసారి గణపతి నవరాత్రి ఉత్సవాలను తెలంగాణ ప్రజలు ఎప్పటికీ మర్చిపోరని చెప్పారు.
కేసీఆర్ నిజాం పాలనను గుర్తుకు తెచ్చేలా వ్యవహరిస్తున్నారని పేర్కొంటూ తెలంగాణలో కేసీఆర్ గణపతి నవరాత్రోత్సవాలు నిర్వహించనీయకుండా అడ్డుపడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.
More Stories
మరోసారి స్మిత అగర్వాల్ ట్వీట్ తో ఇరకాటంలో ప్రభుత్వం!
మే 6 అర్ధరాత్రి నుంచి ఆర్టీసీ సమ్మె
ఎంసీఆర్హెచ్ఆర్డీ వైస్ ఛైర్పర్సన్గా సీఎస్ శాంతికుమారి